అక్కడ ప్రకృతి పచ్చంచు కోక కట్టిన కొండపడుచులా కనిపిస్తుంటుంది. అక్కడి కొండల ముడుతలన్నీ ఆ పచ్చంచు కోక కుచ్చిళ్ల మడతల్లాగా అనిపిస్తుంటాయి. సమస్త మానవాళికి వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి లేలేత కిరణాలు పరచుకున్న ఇక్కడి పచ్చటి ఆకుల స్పర్శను, వాటిపైనుంచి వీచే కొండగాలిని ఆస్వాదించాలంటే... మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు వెళ్లాల్సిందే...!!