భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో పేరెన్నికగన్నవి చంపానేర్-పావగఢ్ ప్రదేశాలు. 2004వ సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా స్థానం సంపాదించుకున్న ఈ అపురూపమైన చారిత్రక ప్రదేశాలు... గుజరాత్ రాష్ట్రంలోని పాంచ్‌మహల్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి ఎత్తయిన పావగఢ్ కొండపై ఉండే కాళికామాత ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వెళ్లేందుకు రోప్ వే సౌకర్యం కూడా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అయితే రోప్ వేలో ప్రయాణించిన తరువాత మళ్లీ ఆలయం చేరుకునేందుకు 250 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది...