ప్రశ్నార్థకంగా జంతు-వృక్ష జాతుల మనుగడ

PNR|
ఎన్నో వృక్ష, జీవ, జంతు జాతుల పుట్టుకకు భారతగడ్డ వేదికగా నిలిచింది. ఎంతో రమణీయమైన ప్రకృతి సౌందర్యాలు, జీవ, ఉభయచర జంతు జాలాలలో తలతూగిన భరతగడ్డపై ప్రస్తుతం వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అభివృద్ధి పేరిట అడవులను నరికి వేయడంతో ఇలాంటి జీవ జాతులకు ఆవాసం కరువైంది. దీనికి తోడు నానాటికీ పెరిగిపోతున్న మానవాళి ఆవాసానికి అవసరమైన స్థలం కోసం అడవులు బలవుతున్నాయి.

దీంతో ఒకనాడు ప్రకృతి ప్రేమికులుగా ఉన్న మానవజాతి నేడు ప్రకృతి వినాశపుత్రులుగా మారుతున్నారు. దీంతో అరుదైన ఎన్నో జీవజాతులు, వృక్ష జాతులు కంటికి కనిపించకుండా పోతున్నాయి. దీనిపై పలువురు పరిశోధకులు తమ ఆందోళను వ్యక్తం చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. పాలకుల్లో తగిన శ్రద్ధ లేకపోవడమే ఈ దుస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.


దీనిపై మరింత చదవండి :