కళ్లను, మనసును మైమరిపించే అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకు స్వర్గధామం కూర్గ్ హిల్ స్టేషన్. ఇక్కడి లోయల్ని, కొండ ప్రాంతాలను ఉదయభానుడి లేలేత కిరణాలు తాకకమునుపే కప్పివేసే పొగమంచు ప్రతి ఒక్కరి మనసును పులకరింపజేస్తుంది. లెక్కలేనంత విస్తీర్ణంలో సాగయ్యే వరిపొలాల పచ్చదనం.. కాఫీ, నారింజ తోటల సౌందర్య సరాగాలు.. మిరియాలు, యాలకుల మసాలా గుభాళింపులు.. వెరసీ కూర్గ్.