పులుల జీవితం ఫిక్స్‌లో పడిపోయింది. ఒకప్పుడు మానవుడు ఎదుటపడితే పంజా విసరడానికి ఎగిరి దూకే పులి.. నేడు మానవుని తూటా దెబ్బకు జడుసుకుని గుహకే పరిమితమై, బయటకొస్తే ప్రాణాలు ఎగిరిపోతాయని భయపడుతూ గజగజ వణకుతోంది. అయినా కొందరు క్రూర మానవులు గుహలోనున్న చారల పులి తాట తీసి డెకరేటర్లకు కానుకగా ( పైసలకు) ఇచ్చేస్తున్నారు. ఇదీ ప్రస్తుతం మన భారతదేశ పులి జీవితం.