గుజరాత్ వనసీమల అందాల్లో పేర్కొనదగినది గిర్ అభయారణ్యం లేదా గిర్ జాతీయవనం. ఇది ఆసియా ప్రాంతపు సింహాలకు నిలయం. ముళ్లపొదలతో నిండిన ఈ అరణ్యంలో అక్కడక్కడా పొదల్లో మృగరాజులు పొంచి ఉంటాయి. కాగా... ఈ వన్యప్రాణుల సంరక్షణా కేంద్రం 1965వ సంవత్సరంలో సుమారు 1412 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో స్థాపించబడింది.