గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. పర్యాటక రంగం
  4. »
  5. అటవీ అందాలు
Written By Pavan Kumar
Last Modified: సోమవారం, 16 జూన్ 2008 (20:49 IST)

పన్నా పులుల సంరక్షణా కేంద్రం

మధ్య ప్రదేశ్‌లో పులుల సంరక్షణా కేంద్రాల్లో ఒకటి పన్నా. ప్రముఖ శిల్పకళా ఖండాల ప్రాంతమైన ఖజురాహోకు పన్నా 25 కి.మీ. దూరంలో ఉంది. కెన్ నది ఒడ్డున ఉంది పన్నా పులుల సంరక్షణా కేంద్రం. కెన్ నది ఒడ్డున ఉన్న జలపాతాలు, లోతైన ప్రాంతాలు పన్నా పులుల సంరక్షణా కేంద్రంలోని భాగం.

పన్నా పులుల సంరక్షణా కేంద్రం వర్షాకాలంలో పచ్చగా కళకళలాడుతుంటే వేసవి కాలం వస్తే ఒక్కసారిగా ఎండిపోయినట్లుగా ఉంటుంది. పన్నా కేంద్రాన్ని 1981లో జాతీయ పార్కుగా కేంద్రం ప్రకటించింది. పులుల సంరక్షణా కేంద్రం 543 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉంది.

పన్నా పులుల సంరక్షణా కేంద్రంలో చిరుత పులులు, ఛింకారాలు, బులుగు రంగు ఎద్దులు, మచ్చల జింకలు, అడవి కుక్కలు, తోడేళ్లు, నక్కలు, కోతులు, మొసళ్లు వంటివి ప్రధానంగా ఉన్నాయి. వీటితో పాటుగా అనేక రకాల పక్షులు ఇక్కడ ఆవాసం ఏర్పరచుకున్నాయి.

చూడవలసిన ఇతర ప్రాంతాలు

అజయ్‌ఘర్ కోట
ఛండేలా రాజుల కాలంలో నిర్మించిన కోట అజయ్‌ఘర్‌లో ఉంది. పన్నాకు 36 కి.మీ. దూరంలో అజయ్‌ఘర్ ఉంది. ఇక్కడపై కొండపై అజయ్‌ఘర్ కోట నిర్మించారు. ఛండేలా రాజుల చివరి కాలంలో ఈ కోట రాజధానిగా ఉండేది.

నాచ్నా
గుప్తులు, నాగవకాటకుల పరిపాలనా కాలంలో ప్రముఖ నగరం నాచ్నా. పన్నాకు 40 కి.మీ. దూరంలో ఉంది నాచ్నా. ఇక్కడ చతుర్ముఖ మహదేవుని దేవాలయం ఉంది. ఇప్పటికీ ఈ దేవాలయాన్ని చూడవచ్చు.

వసతి
మధ్య ప్రదేశ్ పర్యాటక శాఖ, అటవీ శాఖల అతిథి గృహాలతో పాటుగా ఇతర వసతి సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి

విమాన మార్గం : ఖజురాహో (25 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం. ఇక్కడ నుంచి ఢిల్లీ, వారణాసి, ఆగ్రాలకు విమాన సేవలు ఉన్నాయి.
రైలు మార్గం : సాట్నా (90 కి.మీ.), ఝాన్సీ (180 కి.మీ.), కట్ని (150 కి.మీ.) లు సమీపంలోని రైల్వే స్టేషన్లు.
రహదారి మార్గం : పన్నాకు అన్ని చోట్ల నుంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి.