గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By మనీల
Last Modified: బుధవారం, 16 అక్టోబరు 2019 (09:44 IST)

పాల మీగడ, రోజ్‌వాటర్‌‌తో మసాజ్ చేస్తే..?

అర నిమ్మ చెక్కపై చక్కెర చల్లి మోచేతులు, మెడ చుట్టూ, చేతులపై మెత్తగా రుద్దండి. దీంతో చర్మంపై నల్లటి మచ్చలు తొలగిపోయి, చర్మం మృదువుగా మారుతుంది. 
 
ముందుగా పచ్చి బంగాళాదుంపను ఒలిచి, దంచుకోండి. ఆ తర్వాత నల్లబారుతున్న చర్మంపై రుద్దండి. మీ చర్మం మృదువుగానూ, శుభ్రంగానూ ఉంటుంది. 
 
పాల మీగడ, రోజ్‌వాటర్ కలిపి చేతులతో చర్మంపై మసాజ్ చేయండి. ఇది చర్మకాంతిని ఇనుమడింపజేస్తుంది. 
 
పాలు, తేనెను కలిపి మెడభాగంలో, చేతులు, కాళ్లకు మాలిష్ చేయండి. దీంతో చర్మం మృదువుగా తయారవుతుంది.
 
బొప్పాయిపండు గుజ్జును మీరు ఫేస్‌ప్యాక్‌లా వాడుకోవచ్చు. అలాగే చర్మంపై రుద్దితే అందులోనున్న మురికి మటుమాయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.