భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు పెరగవని చెప్పలేను : మన్మోహన్

PNR| Last Modified గురువారం, 10 నవంబరు 2011 (11:04 IST)
పెట్రోల్ ధరల తగ్గింపుపై పునఃపరిశీలన చేసే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు. అలాగే, భవిష్యత్‌లో కూడా పెట్రోల్ ధరలను పెంచబోమని కూడా స్పష్టమైన హామీ ఇవ్వలేమన్నారు.

గతవారం పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల బృందం ప్రధానిని కలిసి తన నిరసనను వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. మరోమారు పెట్రోల్ ధరలు పెంచినట్టయితే, ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును ఉపసంహరించుకుంటామని తెగేసి చెప్పారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు పెంచకుండా చూడాలని విన్నవించిన హామీపై తానేమీ స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. కానీ భవిష్యత్‌లో పెట్రోల్ ధరలు పెరగవనే తాను చెప్పలేనన్నారు.


దీనిపై మరింత చదవండి :