16న పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశం : ఐఓసీ ఛైర్మన్

PNR| Last Modified గురువారం, 10 నవంబరు 2011 (13:32 IST)
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో స్వదేశీయంగా కూడా పెట్రోల్ ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఛైర్మన్ ఆర్.ఎస్.బూటోలా సూచన ప్రాయంగా తెలిపారు.

దీనిపై ఆయన మాట్లాడుతూ గత వారంలో లీటర్ పెట్రోల్‌పై రూ.1.80 వడ్డించిన చమురు కంపెనీలు ఈ నెల 16న ధరలు తగ్గించే అవకాశముందన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గడంతో పాటు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ పెరగిందని ఆయన గుర్తు చేశారు.

అందుకే ఈ ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్టు చెపుతున్నానని తెలిపారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో చమురు కంపెనీలకు పెట్రోల్ అమ్మకం ద్వారా రూ.2500 కోట్ల నష్టం వాటిళ్లే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 125 డాలర్ల నుంచి 115 డాలర్లకు పడిపోయిన విషయం తెల్సిందే.


దీనిపై మరింత చదవండి :