శుక్రవారం, 13 మార్చి 2026
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 15 జనవరి 2026 (18:47 IST)

అమేజాన్ ఇండియా వారి గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026 ప్రారంభపు డీల్స్

Amazon
అమేజాన్ ఇండియా వారి అత్యంత ఎదురుచూసిన గ్రేట్ రిపబ్లిక్ సేల్ 2026, జనవరి 16న ఉదయం 12:00 గంటల నుండి లైవ్‌లోకి వస్తుంది. ఈ షాపింగ్ కార్యక్రమం స్మార్ట్ ఫోన్లు, ఫ్యాషన్లు, బ్యూటీ హోమ్-కిచెన్, వినియోగదారు ఎలక్ట్రానిక్స్, పెద్ద ఉపకరణాలు, కిరాణా సరుకులు, రోజూవారీ అవసరాలు, ఇంకా ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికల్లో ఉత్తేజభరితమైన కొత్త ఆవిష్కరణలు, గొప్ప డీల్స్‌ను ఒక చోట చేరుస్తుంది.
 
యాపిల్, శామ్ సంగ్, వన్ ప్లస్, సోనీ, LG, స్కెచర్స్, లోరియల్ పారిస్, iQOO, Xiaomi, Qubo, TCL, HP, boAt వంటి వివిధ ఎన్నో అగ్ర బ్రాండ్స్ నుండి కస్టమర్లు ఉత్పత్తులను అన్వేషించవచ్చు. కస్టమర్లు ట్రెండింగ్ డీల్స్, 8 PM డీల్స్, టాప్ 77 రిపబ్లిక్ డీల్స్, టాప్ 100 డీల్స్ వంటి కూర్చిన డీల్ ఫార్మాట్స్ నుండి కూడా కొనుగోళ్లు చేయవచ్చు. పొంగల్, మకర సంక్రాంతి, మాఘ బిహు, ఉత్తరాయణ్ వంటి సంబరాల కోసం ఎంపికలు కూర్పు చేయబడ్డాయి. అగ్ర బ్రాండ్స్‌లో పండగలకు తప్పనిసరిగా ఉండవలసినవి, బహుమతుల ఫేవరెట్లు ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌తో కొనుగోళ్లను సులభం చేసాయి.
 
పంట కోతల పండగల నుండి గర్వించదగిన గణతంత్ర దినోత్సవం వరకు, అమేజాన్ ఇండియా పండగ అవసరాలు యొక్క విస్తృత శ్రేణి ఎంపికను, ప్రముఖ బ్రాండ్స్ నుండి ఉత్తేజభరితమైన కొత్త విడుదలల్ని ఒకేచోట అందించడం ద్వారా సంబరాలను మరింత అర్థవంతంగా చేసే లక్ష్యాన్ని కలిగి ఉంది.  AI సదుపాయంతో గుర్తించడం, నమ్మకమైన కస్టమర్ రేటింగ్స్, ఆకర్షణీయమైన లైవ్ షాపింగ్ అనుభవాల మద్దతుతో, భారతదేశంలోని కస్టమర్లు గొప్ప సౌకర్యం, వేగవంతమైన డెలివరీల సహాయం కొనుగోలు చేయడంలో మేము సహాయపడుతున్నాం. ప్రైమ్ సభ్యులు గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లోని ప్రతి రోజూ  అదనపు ఆదాలతో మరింత ఆదా చేయగలరు, అని సౌరభ్ శ్రీవాత్సవ, వైస్ -ప్రెసిడెంట్ అమేజాన్ ఇండియా అన్నారు.