మంగళవారం, 2 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 1 డిశెంబరు 2025 (23:21 IST)

మధ్యప్రాచ్యంలో NRI రియాలిటీ మీట్‌ను నిర్వహించిన ASBL, ఇల్లు కొనే ముందు...

Ajitesh
హైదరాబాద్: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ డెవలపర్, హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న ASBL , తమ గ్లోబల్ ఔట్రీచ్ సిరీస్‌లో భాగంగా మధ్యప్రాచ్యంలో దాని NRI రియాలిటీ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమం మస్కట్, దోహా, అబుదాబి మరియు దుబాయ్‌లలో జరిగింది. ఇది గల్ఫ్ మార్కెట్‌లోకి ASBL యొక్క అధికారిక ప్రవేశాన్ని సూచించటంతో పాటుగా గ్లోబల్ ఇండియన్ కమ్యూనిటీలో అంతర్జాతీయ పెట్టుబడులకు పెంచే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది.
 
భారతీయ రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు మధ్యప్రాచ్యం అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ ప్రాంతంలో ASBL యొక్క కార్యకలాపాలు NRI పెట్టుబడిదారులతో సంబంధాలను పెంచుకోవడానికి, ప్రత్యక్ష అనుసంధానిత ద్వారా వారికి సేవ చేయాలనే దీర్ఘకాలిక నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. 
 
భారతదేశంలో పెట్టుబడి పెట్టేటప్పుడు మారుతున్న మార్కెట్ పరిస్థితిలు, రియల్-టైమ్ డేటాకు పరిమిత లభ్యత, దీర్ఘకాలిక విలువ చుట్టూ అనిశ్చితి వంటి NRIలు ఎదుర్కొనే కీలక సవాళ్లను పరిష్కరించడానికి మిడిల్ ఈస్ట్ NRI రియాలిటీ మీట్ రూపొందించబడింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీరు, ధరల ధోరణులు, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధి, అద్దె రాబడి, హైదరాబాద్‌లో రాబోయే ప్రాజెక్టులు, దీర్ఘకాలిక పెట్టుబడి సామర్థ్యం గురించి స్పష్టమైన అవగాహన పొందేందుకు ఇది  వీలు కల్పించింది. ఈ సెషన్లను ప్రత్యేకంగా నిలిపింది ASBL వ్యవస్థాపకుడు&సీఈఓ అజితేష్ కొరుపోలు ప్రత్యక్ష హాజరు. ఆయన అన్ని నగరాల్లో ముఖాముఖి చర్చలకు నాయకత్వం వహించారు. 
 
ఈ సెషన్‌లలో, ASBL వ్యవస్థాపకుడు&సీఈఓ అజితేష్ కొరుపోలు మాట్లాడుతూ, భారతదేశంలో అత్యంత స్థిరమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ యొక్క నిరంతర ఎదుగుదలను వెల్లడించారు. ప్రీమియం రెసిడెన్షియల్ మైక్రో-మార్కెట్లలో NRI పెట్టుబడులు స్థిరంగా పెరుగుతున్నాయని, దీనికి ఉపాధి వృద్ధి, మెరుగైన పట్టణ ప్రణాళిక, బలమైన నియంత్రణ చట్రాలు కారణమని ఆయన వెల్లడించారు. బలమైన, అత్యంత ప్రభావవంతమైన NRI పెట్టుబడిదారుల సంఘాలలో మధ్యప్రాచ్యం ఒకటన్న ఆయన తమ ఉద్దేశ్యం ప్రాజెక్టులను ప్రదర్శించడమే కాదు, ప్రపంచ భారతీయ కొనుగోలుదారులను పారదర్శకమైన, డేటా-ఆధారిత పరిజ్ఙానంతో శక్తివంతం చేయడమని చెప్పారు.