1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Bengaluru-Mumbai Vande Bharat to Halt at Two Stations in AP

అనంతపురం - గుంతకల్లు స్టేషన్లలో ఆగనున్న వందే భారత్ స్లీపర్

Vande Bharat
ప్రతిపాదిత బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్, అనంతపురం - గుంతకల్లు రైల్వే స్టేషన్లలో ఆగుతూ ఆంధ్రప్రదేశ్‌కు వేగవంతమైన ప్రీమియం రైలు సేవలను అందించనుంది. ఈ రెండు స్టేషన్లు అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి. ధర్మవరం, పుట్టపర్తి, హిందూపురంలో కూడా ఈ రైలుకు హాల్ట్‌లు (ఆగే అవకాశం) కల్పించాలని కోరినప్పటికీ, ప్రస్తుత షెడ్యూల్‌లో వాటికి చోటు దక్కలేదు. 
 
కేఎస్ఆర్ బెంగళూరు- ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్ మధ్య వందే భారత్ స్లీపర్ సేవను ప్రారంభించడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైలును ఈ నెలలోనే ప్రారంభించే అవకాశం ఉంది. ఇది వారానికి ఆరు రోజుల పాటు నడుస్తుందని అంచనా. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం, ఈ రైలు ముంబై నుండి రాత్రి 10:30 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 2:50 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. 
 
తిరుగు ప్రయాణంలో, ఇది బెంగళూరు సిటీ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు ముంబై చేరుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రయాణానికి సుమారు 16 గంటల సమయం పడుతుందని అంచనా. ముంబై- బెంగళూరు మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ రైలు... మహారాష్ట్రలోని సోలాపూర్, పూణే, కళ్యాణ్, కర్ణాటకలోని రాయచూర్, కలబురిగి.. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, గుంతకల్ స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ రైలు అవే స్టేషన్లలో ఆగుతుంది. 
 
ఆంధ్రప్రదేశ్‌లోని స్టేషన్లలో ఈ రైలుకు హాల్ట్‌లు (ఆగే సదుపాయం) కల్పించినందుకు గాను రైల్వే మంత్రి సోమన్నకు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. దీనివల్ల రాయలసీమ ప్రాంతం నుండి బెంగళూరు, ముంబై, ఆ మార్గంలోని ఇతర ప్రధాన నగరాలకు ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. మొత్తం 823 మంది ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ 16-కోచ్‌ల స్లీపర్ రైలులో త్రీ-టైర్, టూ-టైర్ మరియు ఫస్ట్-ఏసీ తరగతి వసతులు ఉంటాయి. అలాగే, గుంతకల్లు-బెంగళూరు మధ్య త్వరలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు ఎంపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరెత్తట్లేదు.. కిషన్ రెడ్డి ప్రశ్న