1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Commercial LPG Prices Hiked By Rs 42 In Delhi, Rs 53.5 In Kolkata Amid Iran war

సిలిండర్ ధరను పెంచిన ఆయిల్ కంపెనీలు.. ఎంత పెంచారంటే...

lpg cylinder
దేశంలో మరోమారు వాణిజ్య సిలిండర్ గ్యాస్ ధరను చమురు కంపెనీలు పెంచాయి. 19 కిలోల సిలిండర్‍‌పై రూ.42 ధరను పెంచుతున్నట్టు సోమవారం అధికారికంగా వెల్లడించాయి. అయితే, ఈ పెంపు వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో మాత్రం రూ.53.50గా ఉండగా, దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ఈ పెంపు రూ.53.5గా ఉంది. కాగా, గత జనవరి నెలలో రూ.1691.50గా ఉండగా, ఈ గ్యాస్ సిలిండర్ ధర ఇపుడు ఏకంగా రూ.3113.5కు చేరడం గమనార్హం. అలాగే, ఆర్థిక రాజధాని ముంబైలో రూ.3024.50, చెన్నైలో రూ.3232, హైదరాబాద్‌లో రూ.3322కు చేరుకుంది. అలాగే, సీఎన్జీ ధరను కూడా కేజీపై రూ.2 చొప్పున పెంచడంతో ఇది ప్రస్తుతం రూ.83.09కు చేరుకుంది. ప్రతినెల ఒకటో తేదీన చేపట్టే ధరల సమీక్షా విధానంలో భాగంగా ఆయిల్ కంపెనీలు ధరలను పెంచాయి.
 
అలాగే, ఐదు కేజీల ఫ్రీట్రేడ్‌ ఎల్పీజీ సిలిండర్లపై రూ.11 చొప్పున పెంచారు. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు. మన దేశంలో సాధారణంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం, హిందూస్థాన్‌ పెట్రోలియం రిటైల్‌ ధరలను ఏకకాలంలో నిర్ణయిస్తాయి. ఇతర సంస్థల గ్యాస్‌ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది.
 
పశ్చిమాసియాలో ఇరాన్‌ - అమెరికా మధ్య యుద్ధంతో హర్మూజ్‌ వద్ద నౌకల రవాణా నిలిచిపోవడం భారత్‌ ఎల్పీజీ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్‌కు అవసరమైన గ్యాస్‌లో చాలా పెద్ద మొత్తం ఈ మార్గంలోనే ఖతార్‌, సౌదీ, యూఏఈల నుంచి వస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇటీవలే ప్రభుత్వ రంగ ఇంధన కంపెనీలు వాణిజ్య గ్యాస్‌ స్టాక్‌ కాకుండా కనీసం 30 రోజులకు సరిపడా నిల్వలు చేయాలని సూచించింది. దిగుమతుల్లో సమస్యలను అధిగమించేందుకు ఈ చర్యను చేపట్టింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఒకటిన్నర ఏళ్ల పసికందుకు చిత్ర హింసలు.. తల్లి చూస్తుండగానే ప్రియుడు..?