శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2016 (12:06 IST)

పొగాకు వ్యాధులతో భారత ఆర్థిక బడ్జెట్‌పై అదనపు భారం!

'పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్' అన్నాడు మన గిరీశం. ప్రపంచ వ్యాప్తంగా పొగాకు వ్యాధుల వల్ల భారత దేశ  ఆర్థిక వ్యవస్థపై  ఏటా రూ.లక్ష కోట్ల మేరకు భారం పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ధూమపానం వల్ల ఏటా 30లక్షల మంది చనిపోతున్నారని అంచ‌నా వేయబడింది.
 
అందువల్ల పొగాకు వినియోగాన్ని సమర్థంగా నియంత్రించడానికి సిగరెట్‌ పెట్టెలపై మరింత పెద్దగా హెచ్చరిక సందేశాలను ముద్రించడమైనది. ఏంటంటే ''పొగాకు సంబంధ వ్యాధుల వల్ల దేశంపై పడుతున్న వార్షిక ఆర్థిక భారం రూ.1,04,500 కోట్ల మేరకు ఉంది. మానవ నష్టాల పరంగా చూస్తే యేటా దాదాపు 10 లక్షల మంది ప్రాణాలను ఇది హరిస్తోంది'' అని డబ్ల్యూహెచ్‌వో ఢిల్లీ ప్రతినిధి హెంక్‌ బెకెడామ్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
 
పొగతాగటం వల్ల ఊపిరితిత్తులే కాదు. ఎముకలు కూడా దెబ్బతింటాయి. పొగ మూలంగా ఎముక సాంద్రత తగ్గుతుంది. దీంతో ఇతరత్రా ఎముకలతో పాటు శరీరాన్ని నిటారుగా నిలిపే వెన్నెముక సైతం బలహీనమవుతుంది. ఇది అంతటితోనే ఆగిపోదు. వెన్ను ఇన్‌ఫెక్షన్‌ వంటి రకరకాల సమస్యలనూ తెచ్చిపెడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై ముద్రించే హెచ్చరిక సందేశాలు, పొగాకుతో ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు, ఈ క్రమంలో దీన్ని మరింత పెద్దగా ముద్రించాలని హెంక్ సూచించారు. పొగాకు వాడకం వల్ల కలిగే నష్టానికి, ప్రతిచర్యగా, వివిధ దేశాల కోరిక మేరకు, ప్రపంచ పొగాకు దినోత్సవం మే 31 ఉద్యమం కేంద్రీకరించే ముఖ్య సందేశం ఏమిటంటే, ఆరోగ్యపరంగా పొగాకు వల్ల కలిగే హానిని గూర్చిన హెచ్చరికలను పొగాకు ప్యాకేజిల, పేకెట్ల‌పై రాతతో బాటు చిత్రాలను కలిపి చూపినట్టైతే, అది ప్రజావగాహనను పెంచడానికి, ఖర్చుపరంగా అన్నింటికన్నా చాలా అనువైన విధానం. ఈ విధంగా పొగాకు వాడకం వల్ల కలిగే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తెలియజేస్తూ, దాని వాడకాన్ని తగ్గించవచ్చు.