శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 జనవరి 2016 (14:20 IST)

విదేశాలకు చెందిన ప్రపంచ మార్కెట్లు రిస్కులో ఉంటే భారత్‌కు దెబ్బే!

భారత్ మార్కెట్ మూలాలు బలంగా ఉన్నప్పటికీ.. ఇతర దేశాల్లో దిగజారుతున్న మార్కెట్లను ఆపే శక్తి మాత్రం భారత్‌కు లేదని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మూడీస్ అభిప్రాయపడింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లు రిస్కులో ఉంటే.. ఆ ప్రభావం భారత్‌పైనా ఉంటుందని పోల్ వివరాలతో కూడిన మూడీస్ నివేదిక తెలిపింది. తద్వారా ఇతర దేశాల కారణంగా ఏర్పడే ఇబ్బందులకు భారత్ సైతం తలవంచాల్సిందేనని మూడీస్ పేర్కొంది. 
 
భారత్ ఆర్థికంగా ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో విదేశాల నుంచి వచ్చే షాకింగ్ న్యూస్ ఒకటని పోల్‌లో పాల్గొన్న 35 శాతం అభిప్రాయపడ్డారు. అయితే మార్కెట్లు నష్టాల్ని చవిచూసి.. ఆపై రికవరీ ప్రారంభమైతే.. మిగిలిన దేశాల కంటే వేగంగా సెన్సెక్స్, నిఫ్టీలు దూసుకెళ్తాయని పోల్‌లో పాల్గొన్న వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే.. 18 నెలల కాలంలో ఆస్తుల విలువ తగ్గుతుందని 40 శాతం మంది వెల్లడించగా, పబ్లిక్ సెక్టార్ సంస్థల పనీతీరు మందకొడిగా ఉంటుందని 89 శాతం మంది ఈ మూడీస్ పోల్‌లో పేర్కొనడం గమనార్హం.