1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. HDFC Mutual Fund Launches Naari Nivesh Yatra to Encourage Financial Awareness and Investing Among Women Across India

మహిళల్లో ఆర్థిక అవగాహన, పెట్టుబడులను ప్రోత్సహించడానికి హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ 'నారీ నివేశ్ యాత్ర' ప్రారంభం

Naari Nivesh Yatra
తిరుపతి: హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్ దేశవ్యాప్తంగా మహిళల్లో ఆర్థిక అవగాహన, పెట్టుబడులపై అవగాహన కలిగించడానికి 'నారీ నివేశ్ యాత్ర'ను నిర్వహించింది. చెన్నైలో జూన్ 26న జెండా ఊపి ప్రారంభించిన ఈ యాత్ర తన తిరుపతి విడతను విజయవంతంగా ముగించింది. కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో మహిళల పాత్ర కీలకమైన నేపథ్యంలో, ఆరు నెలల పాటు సాగే ఈ కార్యక్రమం ద్వారా కమ్యూనిటీల దగ్గరికే ఇన్వెస్టర్ విద్యను తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
 
ఈ యాత్రలో భాగంగా ప్రత్యేక వాహనాలు(కాంటర్లు) వివిధ ప్రాంతాలలో ప్రయాణిస్తూ, వీధి నాటకాలు, ఇంటరాక్టివ్ సదస్సుల ద్వారా సులభమైన రీతిలో ఆర్థిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నాయి. తిరుపతిలోని కోర్లకుంట, తిరుపతి మార్కెట్, లీలామహల్, గాంధీ రోడ్ వంటి పలు ప్రధాన మార్కెట్లలో స్థానిక మహిళలతో ఈ యాత్ర మమేకమైంది. అంతేకాకుండా, దేశవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాలతో 60 ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసి, ఆర్థిక ప్రణాళిక, దీర్ఘకాలిక సంపద సృష్టి  ప్రాముఖ్యతను వివరిస్తున్నారు.
 
సంప్రదాయ పొదుపు పద్ధతులను దాటి, సరైన సమాచారంతో కూడిన పెట్టుబడుల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించే 'బర్నీ సే ఆజాది' కార్యక్రమానికి కొనసాగింపుగా ఈ యాత్ర రూపుదిద్దుకుంది. ఇందులో భాగంగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ప్రయోజనాలు అయిన మార్కెట్ సమయాన్ని లెక్కించాల్సిన అవసరం లేకపోవడం, దీర్ఘకాలిక సంపద సృష్టి , క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి విధానాల గురించి వివరించారు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కేవైసీ (KYC) పూర్తి చేసే విధానం, సెబీ ఆమోదిత రిజిస్ట్రేషన్ వివరాలు , ఫిర్యాదుల పరిష్కారం కోసం స్కోర్స్ (SCORES) లేదా స్మార్ట్ ఓడీఆర్ (Smart ODR) వేదికలను వినియోగించుకోవాలని సూచించారు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలకు లోబడి ఉంటాయని హెచ్చరిస్తూ, పథకానికి సంబంధించిన అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవాలని పేర్కొన్నారు.
About Writer
ఐ వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మాట్లాడుకుందాం రమ్మని పిలిపించి మహిళపై అత్యాచారం చేసిన దుండగులు