డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్‌ని ఆవిష్కరించిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్(యులిప్స్) కింద డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్‌ని ఆవిష్కరించింది. స్థిరంగా డివిడెండ్లు చెల్లించడంలో మంచి ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్‌గా పటిష్టంగా ఉన్న స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపదను పెంచుకోవడంలో కస్టమర్లకు ఈ ఫండ్ సహాయకరంగా ఉంటుంది.
డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్ ఫండ్ అనేది స్థిరమైన డివిడెండ్ ట్రాక్ రికార్డు కలిగి ఉండి, ఫండమెంటల్‌గా పటిష్టమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈక్విటీ మార్కెట్లలో క్రమశిక్షణ మరియు పారదర్శకమైన విధంగా పెట్టుబడులు పెట్టేందుకు తోడ్పడుతుంది. ఈ ఫండ్‌కి ప్రధానంగా నాలుగు మూలస్తంభాలు ఉంటాయి. డివిడెండ్ పేఅవుట్ ఆధారంగా స్టాక్స్ ఎంపిక, పటిష్టమైన ఫైనాన్షియల్స్‌పై ప్రధాన దృష్టితో నాణ్యతను పర్యవేక్షణ మరియు స్థిరమైన క్యాష్ ఫ్లోస్, వివిధ రంగాలవ్యాప్తంగా డైవర్సిఫికేషన్, మరియు మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ, రీబ్యాలెన్స్ చేసుకుంటూ పారదర్శకమైన విధంగా, నిబంధనల ఆధారితమై, క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడి ప్రక్రియ వీటిలో ఉంటాయి.
మరీ ముఖ్యంగా, ఆర్థికంగా పటిష్టంగా ఉండి, కాలపరీక్షకు ఎదురు నిల్చిన కంపెనీలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియో ఉందనే భరోసాతో కస్టమర్లు మరింత ధీమాగా పెట్టుబడులను కొనసాగించేలా ఈ కొత్త ఫండ్ సాధికారత కల్పిస్తుంది. లైఫ్ కవరేజీని పొందుతూనే క్రమశిక్షణ, పారదర్శకత, మరియు అత్యంత నాణ్యమైన ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను అందిపుచ్చుకునేలా, మా యులిప్ కస్టమర్లకు తోడ్పాటు అందించే దిశగా ఈ కొత్త ఫండ్ మరో ముందడుగు కాగలదు” అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ Mr. మనీష్ కుమార్ తెలిపారు.
గత 10 ఏళ్లుగా స్థిరంగా డివిడెండ్లు చెల్లిస్తూ వస్తున్న బీఎస్ఈ 500 స్టాక్స్ నుంచి ఎంపిక చేసిన 50 కంపెనీల పనితీరును ట్రాక్ చేసే బీఎస్ఈ 500 డివిడెండ్ లీడర్స్ 50 ఇండెక్స్‌ని ఈ ఫండ్ అనుసరిస్తుంది. ఈ ఇండెక్స్‌లో 50 స్టాక్స్ ఉంటాయి. అవి వార్షికంగా రీబ్యాలెన్స్ చేయబడతాయి. ఆర్థికంగా పటిష్టమైన మరియు షేర్‌హోల్డర్లకు దీర్ఘకాలికంగా విలువను చేకూర్చే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి కస్టమర్లకు ఈ ఫండ్ ఒక అవకాశం కల్పిస్తుంది.
చారిత్రకంగా చూస్తే, 2026 జనవరి 30 నాటికి ఇండెక్స్ ఫ్యాక్ట్‌షీట్ అనేది వార్షికంగా మూడేళ్ల వ్యవధిలో 33.63%, అయిదేళ్ల కాలంలో 30.96%, పదేళ్ల వ్యవధిలో 20.40% టోటల్ రిటర్న్స్ అందించాయి. క్రమశిక్షణతో కూడుకున్న పెట్టుబడి విధానంతో లభించే దీర్ఘకాలిక అవకాశాలను ఇది తెలియజేస్తుంది. అయితే, నిబంధనల పరిమితుల కారణంగా మధ్యమధ్యలో మారే వెయిటేజీలకి అనుగుణంగా అన్ని స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయడానికి సాధ్యపడదు. ఫలితంగా ట్రాకింగ్ ఎర్రర్‌కి ఆస్కారం ఉండొచ్చు. స్టాక్స్‌ని క్రియాశీలకంగా ఎంచుకోవడం కాకుండా ఈ ఫండ్ ప్రధానంగా ప్యాసివ్, ఇండెక్స్‌ని ప్రతిఫలించే విధానాన్ని పాటిస్తూ, ఇండెక్స్‌లోని స్టాక్స్‌ని ట్రాక్ చేస్తుంది.