1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. India May Double LPG Imports From US To Reduce Gulf Dependence, Strengthen Energy Security

వంటగ్యాస్ గ్యాస్‌పై ఇక గల్ఫ్ దేశాలపై ఆధారపడనక్కర్లేదు.. ఎలా?

LPG gas cylinder
వంటగ్యాస్ కోసం దశాబ్ధాలుగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో.. దేశీయంగా గ్యాస్ కొరత రాకుండా ఉండేందుకు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలను వేగంగా అన్వేషిస్తున్నాయి. 2025 నవంబర్‌లో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఈ ఏడాది భారత్ తన వార్షిక అవసరాల్లో 10 శాతాన్ని అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 
 
యుద్ధం వల్ల గల్ఫ్ సరుకు రవాణా ఆగిపోవడంతో, అమెరికా నుంచి దిగుమతులు అనూహ్యంగా పెరిగాయి. అమెరికా ద్వారా ఇంధన భద్రత లభించినప్పటికీ, భవిష్యత్తులో గల్ఫ్ దేశాలపై ఆధారపడటం పూర్తిగా తగ్గడం సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా నుంచి వచ్చే సరుకు రవాణాకు ఎక్కువ సమయం పట్టడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితిని తట్టుకోవడానికి భారత పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం ఉన్న 45 రోజుల రోలింగ్ ఇన్వెంటరీకి అదనంగా, మరో 30 రోజుల కాలానికి సరిపడా వ్యూహాత్మక ఎల్‌పిజి నిల్వలను నిర్మించాలని చమురు కంపెనీలను ఆదేశించింది. 
 
అమెరికాతో పాటు అర్జెంటీనా, నైజీరియా, మలేషియా, అల్జీరియా వంటి ప్రత్యామ్నాయ దేశాల నుంచి దిగుమతులను పెంచుకోవడం ద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో అమెరికా ఒక నమ్మకమైన వనరుగా నిలుస్తుంది.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పెళ్లైన రెండు నెలలకే నవ వధువు ఆత్మహత్య.. గూగుల్‌లో సెర్చ్ చేసి?