శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జనవరి 2016 (06:36 IST)

24 దేశాల పౌల్ట్రీ దిగుమతులపై నిషేధం విధించిన ఇరాక్

ఇరాక్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌల్ట్రీ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే దేశాల జాబితా నుంచి 24 దేశాలను పక్కనబెట్టింది. ఈ నిషేధిత దేశాల్లో భారత్ కూడా ఉంది. బర్డ్‌ఫ్లూ కారణంతో కోడిమాసం, కోళ్లు, గుడ్లు, అన్ని రకాల పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులను నిషేధిస్తున్న ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. 
 
ఇరాక్ నిషేధిత దేశాల జాబితాలో భారత్‌తో పాటు.. బంగ్లాదేశ్‌, నేపాల్‌, బుర్కినోఫాసో, భూటాన్‌, చైనా, ఈజిప్ట్‌, ఘనా, హాంగ్‌కాంగ్‌, ఇజ్రాయెల్‌, ఐవరీ కోస్ట్‌, కజక్‌స్తాన్‌, లావోస్‌, లిబియా, మయన్మార్‌, మెక్సికో, నైగర్‌, నైజీరియా, ఉత్తర కొరియా, పాలస్తీనా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, వియత్నాం దేశాలు ఉన్నాయి.