చెన్నైలో డాక్టర్ ఫిక్సిట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన పిడిలైట్

dr fixit centre
PNR| Last Updated: బుధవారం, 23 సెప్టెంబరు 2015 (17:01 IST)
చెన్నైలో డాక్టర్ ఫిక్సిట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పిడిలైట్ ఇండస్ట్రీస్‌ ప్రారంభించింది. స్థానిక గోపాలపురం, లాయడ్స్ రోడ్డులో ఈ కేంద్రాన్ని ఆ సంస్థ ఛైర్మన్ మధుకర్ బి పరేఖ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధునాతన వాటర్ ప్రూఫింగ్ సొల్యూషన్ విభాగంలో ఆర్కిటెక్ట్‌లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లకు అవగాహన కల్పించేందుకు, ఎక్స్‌పీరియన్ అనుభవాన్ని తెలియజేసేందుకు ఈ తరహా కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ తరహా ఎక్స్‌పీరియన్స్ కేంద్రాన్ని చెన్నైలో ప్రారంభించడం ఇదేతొలిసారని గుర్తు చేశారు. అధునాతన వాటర్ ప్రూఫింగ్ విభాగంలోని మెళకువులు, టెక్నిక్స్‌ను బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఆర్కిటెక్ట్‌లకు తెలియజేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాని, ఇది తమ చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు.
 
 
ఆ తర్వాత కన్‌స్ట్రక్షన్ కెమికల్స్ డివిజన్ సీఈఓ డాక్టర్ సంజయ్ బహదూర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో అతిపెద్ద కమర్షియల్, ఇండస్ట్రియల్‌ హబ్‌గా చెన్నై ఉందన్నారు. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్, హౌసింగ్ సెగ్మెంట్‌ వృద్ధిరేటు గణనీయంగా ఉందన్నారు. అందువల్లే ఇది సరైన ప్రాంతంగా గుర్తించి ఈ తరహా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ తరహా ఎక్స్‌పీరియన్స్ కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు.దీనిపై మరింత చదవండి :