శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2015 (16:46 IST)

దృష్టిలోపం ఉన్నవారు కూడా గుర్తించేలా రూ.500, రూ.1000 నోట్లు : ఆర్బీఐ

ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను దృష్టిలోపం ఉన్నవారు గుర్తించలేని పరిస్థితి ఉంది. అలాకాకుండా, సాధారణ పౌరులు తరహాలోనే దృష్టిలోపం ఉన్నవారు కూడా ఈ నోట్లను గుర్తించేలా భారత రిజర్వు బ్యాంకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులోభాగంగా ఇప్పటికే ఆర్బీఐ రూ.500 కొత్త నోటును చెలామణిలోకి తెచ్చింది. ఇందులో సంఖ్యాపట్టిలోని అంకెల పరిమాణం పెంచి, నోటుపై బ్లీడ్‌ లైన్‌ లేకుండా, పెంచిన గుర్తింపు చిహ్నాలతో రూపొందించింది. అయితే, దొంగనోట్ల ముద్రణకు అవకాశం లేకుండా మరోరెండు కొత్త మార్పులను చేయనున్నట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
కొత్తగా ప్రవేశపెట్టనున్న రూ.500, రూ.1000 నోట్లలో సంఖ్యాపట్టిలోని అంకెలన పరిమాణాన్ని పెంచుతామని అయితే అందులోని తొలిమూడు అక్షరాలతో కూడిన అంకెలను మాత్రం ప్రస్తుత పరిమాణంలోనే కొనసాగించనున్నట్లు తెలిపింది. అలాగే దృష్టిలోపం ఉన్నవారు సులభంగా గుర్తించేలా ఈ రెండురకాల నోట్లపై ఉండే బ్లీడ్‌ లైన్లలోనూ మార్పులు తీసుకురానున్నట్లు స్పష్టంచేసింది.