సంబంధిత వార్తలు
ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన టాటా మోటార్స్
Tata EVs
ఈ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ ఇన్సెంటివ్లు అంతర్భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా టాటా కర్వ్ ఈవీ (Curvv EV)పై గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా, ఎంపిక చేసిన నాన్-ఎక్స్ సిరీస్ వేరియంట్లపై రూ. 3 లక్షల వరకు నగదు తగ్గింపుతో పాటు ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్లు లభించనున్నాయి.
ఇతర మోడళ్లపై అందుబాటులో ఉన్న ఆఫర్ల వివరాలు...
టాటా హారియర్ ఈవీ: ఈ మోడల్‌పై ప్రత్యక్ష నగదు తగ్గింపు లేనప్పటికీ, ఎక్స్చేంజ్/స్క్రాపేజ్, లాయల్టీ బోనస్ రూపంలో రూ. 2.75 లక్షల వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
టాటా పంచ్ ఈవీ: లాంగ్ రేంజ్ (LR) వేరియంట్లపై రూ.1.45 లక్షల వరకు, మిడ్ రేంజ్ (MR) వేరియంట్లపై రూ.1.25 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.
టాటా టియాగో ఈవీ: పాత మోడళ్లపై రూ. 1.45 లక్షల వరకు, LR వేరియంట్లపై రూ. 65,000 నుంచి రూ. 1 లక్ష వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి.
