సంబంధిత వార్తలు
- మరో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్... త్వరలోనే హోం ఇన్వర్టర్లు
- హైదరాబాద్‌లో RS457 ట్రాక్ డే: వాహన చోదకుల నైపుణ్యాభివృద్దిని వేగవంతం చేస్తోన్న అప్రిలియా ఇండియా
- జీవిత బీమాతో పిల్లల భవిష్యత్తు లక్ష్యాల నుంచి పదవీ విరమణ ప్రణాళిక వరకు...
- 4 డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ ట్రాక్స్‌ను ఆటోమేట్ చేయడానికి మారుతి సుజుకీ మొమోరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ పైన సంతకం
- ఒక దేశం, లెక్కలేనన్ని మ్యాగీ కలిసికట్టు క్షణాలు
టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్; మొదటి వాహనంగా జెఎల్ఆర్ యొక్క రేంజ్ రోవర్ ఎవోక్ తయారు
తమిళనాడు: భారతదేశంలో సుప్రసిద్ధమైన కార్లు, ఎస్‌యూవీల తయారీ సంస్థ అయిన టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ (టిఎంపీవి) మరియు దాని అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటోమోటివ్ పిఎల్‌సి (జెఎల్ఆర్), తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని పనపాక్కంలో తమ కొత్త ఉత్పాదక కేంద్రంలో కార్యకలాపాలను ప్రారంభించినట్లు ఈరోజు వెల్లడించాయి.
ప్రస్తుత కర్మాగారం, టిఎంపీవి, జెఎల్ఆర్ బ్రాండ్‌ల కోసం ఈవీలతో సహా తదుపరి తరం వాహనాలను ఉత్పత్తి చేయడానికి ఏర్పాటు చేసిన గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ అభివృద్ధిలో మొదటి దశను ప్రతిబింబిస్తుంది. ఈ ప్లాంట్ నుండి వెలువడిన మొదటి వాహనం, జెఎల్ఆర్ యొక్క స్థానికంగా తయారు చేయబడిన రేంజ్ రోవర్ ఎవోక్. ఈ మోడల్ దాని ఆధునిక విలాసం, అసాధారణమైన పనితనపు నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ తయారీ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎం.కె. స్టాలిన్ మరియు టాటా సన్స్ & టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఛైర్మన్ శ్రీ ఎన్. చంద్రశేఖరన్, ప్రముఖ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ బ్యూరోక్రాట్లు, ప్రభుత్వ అధికారులు మరియు టిఎంపీవి, జెఎల్ఆర్, మరియు టాటా గ్రూప్ నుండి సీనియర్ నాయకుల సమక్షంలో ప్రారంభించారు.
టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్- జెఎల్ఆర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం తమిళనాడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ మాట్లాడుతూ, ఎంతో కాలంగా దేశ నిర్మాణంలో అత్యంత కీలకమైన పాత్రను టాటా గ్రూప్ పోషిస్తోంది, తమిళనాడుతో సుదీర్ఘమైన, చారిత్రక భాగస్వామ్యాన్ని పంచుకుంటోంది. ఈ కొత్త తయారీ కేంద్రంలో కార్యకలాపాల ప్రారంభం మరియు పనపాక్కం, రాణిపేటలో మొదటి రేంజ్ రోవర్ ఎవోక్ తయారీతో, ప్రపంచ స్థాయి ఆటోమోటివ్ తయారీ విస్తరణకు సాక్ష్యంగా నిలవడం రాష్ట్రానికి గర్వకారణం. ఈ ముఖ్యమైన మైలురాయిని తమిళనాడు స్వాగతిస్తుంది, ఉద్యోగాలను సృష్టించే, ఆవిష్కరణలను ప్రోత్సహించే, భారతదేశపు ప్రముఖ తయారీ, మొబిలిటీ కేంద్రంగా మా స్థానాన్ని పునరుద్ఘాటించే పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది అని అన్నారు.
ఈ సందర్భంగా టాటా సన్స్-టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ చైర్మన్ శ్రీ ఎన్. చంద్రశేఖరన్ మాట్లాడుతూ, మా పనపక్కం తయారీ కేంద్రం ప్రారంభం పర్యావరణ అనుకూల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న తయారీ రంగంలో భారతదేశం యొక్క నాయకత్వాన్ని వేగవంతం చేయడానికి కృషి చేస్తోన్న టాటా గ్రూప్ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. పారిశ్రామిక నైపుణ్యం, ఆవిష్కరణ మరియు సమగ్ర వృద్ధిని కొనసాగించే రాష్ట్రమైన తమిళనాడుతో మా దీర్ఘకాల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా వున్నాము. ఈ కేంద్రంతో, భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం అసాధారణ నాణ్యత, నైపుణ్యం, సాంకేతికత కలిగిన వాహనాలను ఉత్పత్తి చేయడానికి మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అని అన్నారు.
