సంబంధిత వార్తలు
- చైనాలోని బొగ్గు గనిలో భారీ పేలుడు - 82 మంది మృతి
- Donald Trump: చైనాలో పర్యటించనున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
- అవినీతిపై డ్రాగన్ కంట్రీ ఉక్కుపాదం... రక్షణ శాఖ మాజీ మంత్రులకు మరణశిక్ష
- China: చైనా బాణసంచా కర్మాగారంలో పేలుడు... 21 మంది మృతి
- అక్రమ మార్గాల ద్వారా వైద్య సీట్లు ఇప్పిస్తామనే ఏజెంట్లతో జాగ్రత్త- సజ్జనార్
హోటల్ లాయల్టీని సరికొత్తగా మారుస్తున్న ప్రయాణ అభిరుచులు: మారియట్ బాన్‌వాయ్ నివేదిక
చైనా మినహా ఆసియా పసిఫిక్(APEC) ప్రాంతంలో లాయల్టీ ప్రోగ్రామ్‌ల భాగస్వా మ్యం మరింత సంక్లిష్టమైన, పరిణతి చెందిన దశకు చేరుకుంటోంది. మారియట్ బాన్‌వాయ్ లాయల్టీ ట్రెండ్స్ రిపోర్ట్ 2026 ప్రకారం, APEC ప్రాంతంలోని 89 శాతం మంది ప్రయాణికులు కనీసం ఒక్క లాయల్టీ ప్రోగ్రామ్‌లోనైనా సభ్యత్వం కలిగి ఉన్నప్పటికీ, వారందరూ ఒకేలా స్పందించడం లేదు. వినియోగదారుల ఆసక్తి అనేది ఇప్పుడు వారి ప్రయాణ ప్రాధాన్యతలు, రోజువారీ లభించే విలువపై అంచనాలు, ఆయా స్థానిక మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటోంది. అందరికీ ఒకే రకమైన లాయల్టీ నమూనాలు పనికిరావనే స్పష్టమైన మార్పును ఈ నివే దిక సూచిస్తోంది.
లాయల్టీ భాగస్వామ్యాన్ని శాసిస్తున్న ప్రయాణ అభిరుచులు
ట్రెండ్ రిపోర్ట్ ఫలితాల ప్రకారం, ప్రయాణికుల విభిన్న అభిరుచులే లాయల్టీ భాగస్వామ్యాన్ని అత్యధికంగా ప్రభావితం చేస్తున్నాయి. ప్రయాణికులు లాయల్టీ పాయింట్లను ఎలా సంపాదిస్తారు, ఎలా వాడుకుంటారు, వాటి ప్రయో జనాలకు ఎంత విలువ ఇస్తారు అనేది ప్రధానంగా వారు ఏ ఉద్దేశ్యంతో ప్రయాణం చేస్తున్నారనే దానిపైనే ఆధార పడి ఉంటుంది. కాబట్టి, విభిన్న మార్కెట్లలోని రకరకాల ఆసక్తులకు అనుగుణంగా విజయవంతమైన లాయల్టీ ప్రోగ్రామ్‌లను రూపొందించడానికి మరింత విస్తృత, లోతైన ప్రణాళికలు అవసరమని ఈ నివేదిక సూచిస్తోంది.
ఈ నివేదిక ఆసియా పసిఫిక్(APEC) ప్రాంతంలో మొదటి ఐదు ప్రయాణ ప్రాధాన్యతలను గుర్తించింది. ఆహారం & భోజన అనుభవాలు, ప్రకృతి/సందర్శన, షాపింగ్, సాంస్కృతిక అనుభూతి, విశ్రాంతి & ఏకాంతం.
ఇందులో 'ఆహారం& భోజన అనుభవాలు' అనేది ప్రయాణ, హోటల్ లాయల్టీని పెంచే అత్యంత శక్తివంతమైన అంశంగా అవతరించింది. APEC ప్రాంతంలోని 63% మంది ప్రయాణికులు తమ పర్యటనలు ప్లాన్ చేసుకునేట ప్పుడు రుచికరమైన ఆహార అనుభవాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ రకమైన ప్రయాణికులు స్పష్టమైన లాయల్టీ ప్రవర్తనను ప్రదర్శిస్తున్నారు. వీరు ఆహార సంబంధిత కార్యకలాపాల ద్వారా పాయింట్లను సంపాదించడానికి, వాటిని తిరిగి హోటల్ ఫుడ్- బెవరేజ్ సేవల కోసమే ఉపయోగించడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నా రు. దీనివల్ల హోటల్ లాయల్టీ వ్యాపారంలో ఆహారం అత్యంత కీలకమైన, విస్తరించదగిన సాధనంగా మారింది.
విశ్రాంతి- ఏకాంతం కోరుకునే ప్రయాణికులే హోటల్ లాయల్టీ వృద్ధికి అతిపెద్ద అవకాశంగా నిలుస్తున్నారు. ఇతర ప్రయాణికులతో పోలిస్తే వీరు హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లలో చేరడానికి పెద్దగా ఆసక్తి చూపించనప్పటికీ, ఒక్కసారి హోటల్ లోపలికి అడుగుపెట్టిన తర్వాత మాత్రం వారి భాగస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటోంది. వీరు తమ భాగస్వామితో కలిసి హోటళ్లు, రిసార్టులు, విల్లాలలో బస చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే హోటల్ బస, ఫుడ్ & బెవరేజ్, స్పా సేవల ద్వారా లాయల్టీ పాయింట్లను సంపాదిస్తూ ఉంటారు. దీన్నిబట్టి 'Recharge & Disconnect' ప్రయాణికులకు వారు బస చేసే ఆ హోటల్ లేదా రిసార్ట్ ప్రాంగణమే ఒక ప్రధాన గమ్యస్థానంగా మారుతోందని స్పష్టమవుతోంది.
ట్రావెల్ లాయల్టీలో హోటల్ లాయల్టీయే అత్యంత ప్రధానమైనది
ఆసియా పసిఫిక్(APEC) ప్రాంతంలో ఎయిర్‌లైన్స్, రీటైల్, డైనింగ్ ప్రోగ్రామ్‌ల కంటే హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్ లలోనే అత్యధికంగా 66% మంది ప్రయాణికులు భాగస్వామ్యం కలిగి ఉన్నారు. ఈ కేటగిరీలో సభ్యుల నిలుపు దల కూడా బలంగా ఉంది; చాలా మంది ప్రయాణికులు రెండేళ్లకు పైగా తమ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్నారు. బ్రాండ్‌లతో ప్రయాణికులకు ఉండే అనుబంధాన్ని బలోపేతం చేయడంలో హోటల్ లాయల్టీ కీలక పాత్ర పోషిస్తోందని ఇది స్పష్టం చేస్తోంది.
తక్షణ, రోజువారీ విలువకే అత్యధిక ప్రాధాన్యత
ఆసియా పసిఫిక్ (APEC) ప్రాంతమంతటా ఒక స్పష్టమైన ప్రాథమిక అంచనా కనిపిస్తోంది. రోజువారీ ఖర్చులపై పాయింట్లు సంపాదించుకునే అవకాశం అనేది కచ్చితంగా ఉండాల్సిందే. ఒక మంచి లాయల్టీ ప్రోగ్రామ్‌కు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం ఏమిటంటే, రోజువారీ అవసరాల కోసం చేసే ఖర్చుల నుండి కూడా పాయింట్లను పొందే వీలుండటమే. ఇక పాయింట్లను వాడుకుని ప్రయోజనాలను పొందడంలో విభిన్న ధోరణులు ఉన్నాయి. 77% మంది ప్రయాణికులు వెంటనే లభించే చిన్నచిన్న రివార్డుల కోసం పాయింట్లను ఉపయోగిస్తుండగా, 61% మంది పెద్ద రివార్డుల కోసం, 37% మంది ప్రత్యేకమైన అనుభూతుల కోసం తమ పాయింట్లను వాడుకుంటున్నారు. లాయల్టీ ప్రోగ్రామ్‌లు విజయవంతం కావాలంటే, భవిష్యత్తులో లభించే ఆకర్షణీయమైన పెద్ద రివార్డు లతో పాటు రోజువారీగా ఉపయోగపడే ఆచరణాత్మక విలువను కూడా సమతుల్యం చేయాలని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.
హోటల్ లాయల్టీకి బలాన్ని ఇస్తున్న భాగస్వామ్యాలు
విస్తృత భాగస్వామ్య వ్యవస్థ కలిగిన హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తు న్నారు. ఆసియా పసిఫిక్ (APEC) ప్రయాణికులు పాయింట్లను సంపాదించడానికి, వాడుకోడానికి మరిన్ని మార్గాలను కోరుకుంటున్నారు. ఇందులో సగం మంది ప్రయాణికులు పాయింట్లను సులభంగా సంపాదించే, ఖర్చు చేసే ఆప్షన్లతో పాటు, రివార్డులను పొందేందుకు మరిన్ని ఎక్కువ భాగస్వామ్య ఎంపికలు ఉండాలని ఆశిస్తున్నా రు. దీన్నిబట్టి హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లు కేవలం హోటల్ బసకే పరిమితం కాకుండా, రోజువారీ అవసరాలతో కూడిన విస్తృత వ్యవస్థతో ముడిపడి ఉన్నప్పుడే మరింత బలాన్ని పుంజుకుంటాయని స్పష్ట మవుతోంది.
APEC ప్రాంతంలో హోటల్ లాయల్టీ పాయింట్ల సంపాదన ప్రధానంగా హోటళ్లలో బస చేయడం (57%), కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ ఖర్చుల(53%) ద్వారా జరుగుతోంది. ఆ తర్వాత ఫుడ్ డెలివరీ- డైనింగ్ (48%), రీటైల్ & ఈ-కామర్స్ భాగస్వామ్యాలు (45%) నిలుస్తున్నాయి. లాయల్టీ ప్రోగ్రామ్‌లు ప్రయాణాలతో పాటు రోజువారీ ఖర్చులకు కూడా అనుకూలంగా ఉన్నప్పుడే హోటల్ లాయల్టీ ఉత్తమంగా వృద్ధి చెందుతుందని ఇది సూచిస్తోంది.
ఇక పాయింట్లను వాడుకునే విషయానికి వస్తే, ప్రయాణికులు తమ హోటల్ లాయల్టీ పాయింట్లను హోటల్ రూమ్ అప్‌గ్రేడ్‌ల కోసం(58%), చిన్నచిన్న ఫుడ్ & బెవరేజ్(F&B) అనుభవాల కోసం(57%), ప్రాక్టికల్ ట్రావెల్ ప్రయోజనాల కోసం(51%) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. తమ ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరిచే రివార్డులకే సభ్యులు ఎక్కువ విలువ ఇస్తున్నారని ఇది తెలియజేస్తోంది.
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మూడు రకాల విభిన్న లాయల్టీ మనస్తత్వాలు
ఆసియా పసిఫిక్ (APEC) ప్రాంతంలో లాయల్టీ ప్రోగ్రామ్‌ల భాగస్వామ్యం విస్తృతంగా ఉన్నప్పటికీ, లాయల్టీ అర్థం, దాని పనితీరు, అందుకు గల ప్రేరణలు ఒక్కో మార్కెట్‌ను బట్టి గణనీయంగా మారుతుంటాయి. ఈ నివేదిక APEC మార్కెట్లలో మూడు రకాల విభిన్న లాయల్టీ మనస్తత్వాలను గుర్తించింది. హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల నుండి ఈ మూడు వర్గాల వారు ఆశించే ప్రయోజనాలు వేర్వేరుగా ఉన్నాయి.
లాయల్టీ స్ట్రాటజిస్ట్‌లు: జపాన్, దక్షిణ కొరియా
ఈ పరిణతి చెందిన మార్కెట్లలో ప్రయాణికుల లాయల్టీ ప్రవర్తన చాలా ఆలోచనాత్మకంగా, హేతుబద్ధంగా, పక్కా ప్రణాళికతో కూడి ఉంటుంది. ఇక్కడి ప్రయాణికులు లాయల్టీ ప్రోగ్రామ్‌లను ఒక వ్యూహాత్మక సాధనంగా భావిస్తారు. క్రమశిక్షణతో కూడిన పాయింట్ల సంపాదన, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌ల వాడకం లేదా హోటల్ బస ద్వారా పా యింట్లను జమ చేయడం, వాటిని ఫుడ్& బెవరేజ్ లేదా ఖర్చులను తగ్గించుకునే ప్రాక్టికల్ రివార్డుల కోసం ఉప యోగించడం ద్వారా గరిష్ట విలువను పొందుతారు. ఈ ప్రయాణికులకు లాయల్టీ ప్రోగ్రామ్‌లలో ఉండే స్థిరత్వమే నమ్మకాన్ని కలిగిస్తుంది. అందుకే వీరు వివిధ ప్రోగ్రామ్‌లలో భాగస్వామ్యం అయ్యేటప్పుడు చాలా ఆచి తూచి, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు.
వాల్యూ ఆప్టిమైజర్లు: సింగపూర్, ఆస్ట్రేలియా, థాయిలాండ్
ఈ మార్కెట్లలోని ప్రయాణికులు లాయల్టీ ప్రయోజనాలను ఎంచుకునే విషయంలో చాలా ఆచరణాత్మకంగా వ్యవహరిస్తారు. వీరు లాయల్టీ ప్రోగ్రామ్‌లలో చురుగ్గా ఉన్నప్పటికీ, తమకు నచ్చిన వాటిని మాత్రమే ఎంచుకుం టారు. లాయల్టీ వల్ల తమ ప్రయాణ విలువ, సౌలభ్యం లేదా సామర్థ్యం స్పష్టంగా పెరుగుతాయని నమ్మినప్పుడే వీరు అందులో భాగస్వాములు అవుతారు. డైరెక్ట్ బుకింగ్ ఆఫర్లు, మైల్‌స్టోన్ బోనస్‌లు, రూమ్ అప్‌గ్రేడ్‌లు, 'లేట్ చెకౌట్' లేదా మెరుగైన రూమ్ సదుపాయాల వంటి ప్రాక్టికల్ ప్రయోజనాలకు వీరు ఎక్కువగా ఆకర్షితులవుతారు. తమ ప్రయాణ అనుభవాన్ని నిజంగా మెరుగుపరిచే లేదా ప్రత్యక్షంగా డబ్బు ఆదా చేసేలా ఉండే హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లకే వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
ఎక్స్‌పీరియన్స్ సీకర్స్: ఇండియా, ఇండోనేషియా, వియత్నాం
వేగంగా విస్తరిస్తున్న ఈ మార్కెట్లలోని ప్రయాణికులు లాయల్టీ ప్రోగ్రామ్‌లతో కేవలం లావాదేవీల పరంగానే కాకుండా మానసికంగా కూడా కనెక్ట్ అవుతారు. వీరు భాగస్వామ్య వ్యవస్థలు, ప్రత్యేకత, హోదా, చిరస్మరణీయ అనుభూతులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈ మార్కెట్లలో లాయల్టీ అనేది కేవలం డబ్బు ఆదా చేసే సాధనంగానే కాకుండా, ఉన్నత ఆకాంక్షలను, సరికొత్త విషయాలను అన్వేషించే ఒక మార్గంగా ఉపయోగపడుతుంది. పెరుగుతున్న సంపదతో కూడిన ఈ మార్కెట్లు, ఈ ప్రాంతంలోనే అత్యంత బలమైన వృద్ధి చోదకశక్తిగా నిలుస్తున్నాయి.
మొత్తంగా, ఈ విభిన్న లాయల్టీ మనస్తత్వాల ఆవిర్భావం ఈ నివేదిక ప్రధాన ఫలితాన్ని మరింత బలపరుస్తోంది: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో లాయల్టీ వృద్ధి అనేది ఒకే ఒక ప్రాంతీయ ఫార్ములా ఆధారంగా సాధ్యం కాదు.
హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లు కేవలం ప్రయాణికుల చుట్టూ మాత్రమే కాకుండా, వారితో పాటుగా ఎదిగే ఒక అనుకూలమైన వ్యవస్థగా మారాలి. APEC అంతటి వైవిధ్యమైన, వేగంగా దూసుకుపోతున్న ప్రాంతంలో, స్థానిక ప్రవర్తనలను మరియు సాంస్కృతిక వ్యత్యాసాలను లోతుగా అర్థం చేసుకునే బ్రాండ్‌లు మాత్రమే కేవలం వ్యాపార విస్తరణకే పరిమితం కాకుండా, శాశ్వతమైన గుర్తింపును, వినియోగదారుల నమ్మకాన్ని సొంతం చేసుకోగలవు. మారియట్ బాన్‌వాయ్‌లో మేం మా విస్తృత పోర్ట్‌ఫోలియో, హైపర్‌లోకల్ భాగస్వామ్యాలు, 'మారియట్ బాన్‌వా య్ మోమెంట్స్' వంటి ప్రత్యేక అనుభూతుల ద్వారా దీన్ని నిజం చేస్తున్నాం అని మారియట్ ఇంటర్నేషనల్ ఆసియా పసిఫిక్ (చైనా మినహా) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జాన్ టూమీ తెలిపారు.
భారత్‌లో లాయల్టీ ధోరణులు
షాపింగ్ నిమిత్తం ప్రయాణించే అవకాశం అత్యధికం
93% మంది లాయల్టీ ప్రోగ్రామ్‌లలో పాల్గొంటారు (APECలో 2వ స్థానం)
69% మంది తమ పాయింట్లను వెచ్చించి విలువైన వస్తువులను పొందుతారు. ఇది APECలోనే అత్యధికం
APECలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే, వీరు బ్యాంక్ బదిలీల ద్వారా పాయింట్లను ఆర్జించే అవకాశం ఎక్కువ (43% vs APEC సగటు 36%)
41% మంది లాయల్టీ ప్రోగ్రామ్‌లలో చురుకుగా కొనసాగుతారు, ఎందుకంటే అవి వారికి ప్రత్యేకమైన అనుభ వాలను పొందే అవకాశాన్ని కల్పిస్తాయి
భారత మార్కెట్ల నుండి వచ్చే ప్రయాణికుల ప్రొఫైల్స్, APECలోని ఇతరుల నుండి వారిని వేరుచేసే అంశాలు, వారు హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లతో ఎలా మమేకమవుతున్నారనే దాని గురించి మరింత సమాచారం జతచేయబడింది.
