గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2015 (10:44 IST)

మార్పుల్లేని అమెరికా ఫెడ్ రిజర్వు రేట్లు.. భారత్‌లో తగ్గనున్న వడ్డీ రేట్లు

అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు లేవు. దీనికితోడు.. ఓ కుదుపుకుదిపిన చైనా మార్కెట్లు తిరిగి కోలుకుంటుండటంతో భారత్‌లో వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆశాజనకమైన పరిస్థితుల కారణంగా భారత రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించేందుకు మొగ్గు చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అమెరికా తీసుకున్న నిర్ణయం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. 
 
సాధారణంగా అమెరికా వడ్డీ రేట్లు పెంచితే  మన మార్కెట్లలో ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు తరలిపోయే ప్రమాదముంది. పెట్టిన పెట్టుబడికి ఎక్కడైతే లాభాలు ఆశించిన స్థాయిలో ఉంటాయో  అక్కడే స్థిరంగా ఉంటారు ఇన్వెస్టర్లు. అలా ఇన్వెస్టర్లు వెళ్లిపోతే మన మార్కెట్లు కుప్పుకూలతాయి. ఆ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతుంది. 2006 తర్వాత వడ్డీ రేట్లను మార్చని అమెరికా అదే ట్రెండ్‌ను మరోసారి కొనసాగించింది.