శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (18:05 IST)

ప్రేమికుల రోజాలకు బాగా డిమాండ్: బెంగళూరు నుంచే 55 శాతం గులాబీల ఎగుమతి!

వాలెంటైన్ డే నేపథ్యంలో ప్రేమికుల రోజాలకు బాగా డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ నుంచి యూరప్ ప్రాంతానికి ఎగుమతి చేసే గులాబి పూల పరిమాణం పది శాతం పెరగగా, ధర కూడా బాగా పెరిగినట్లు తెలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 19 మిలియన్ల గులాబీలను ఎగుమతి చేశారు. గత ఏడాదితో పోలిస్తే రెండు మిలియన్ల గులాబీలను ఎక్కువగా ఎగుమతి చేశామని భారత్‌కు చెందిన పూల వ్యాపారి ప్రవీణ్ శర్మ పేర్కొన్నారు. 
 
భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న గులాబీ పూలలో 55 శాతం బెంగళూరు నుంచే రవాణా అవుతున్నాయి. ముంబయి ఎయిర్ పోర్ట్ నుంచి 45 శాతం గులాబీలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా చూస్తే మహారాష్ట్రలోని పూణె-నాసిక్-కొల్హాపూర్, కర్ణాటకలోని బెంగళూరు, హోసూరుతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి గులాబీల ఎగుమతికి ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. సేంద్రీయ గులాబీల విషయానికొస్తే గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దేశవాళీ మార్కెట్ బాగా ఉంది.