శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 17 మార్చి 2016 (16:26 IST)

విజయ్ మాల్యా భవనం కొనుగోలుకు ముందుకు రాని బిడ్డర్లు

లిక్కర్ డాన్ విజయ్ మాల్యా దాదాపు రూ.7 వేల కోట్ల మేరకు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అప్పులు తిరిగి చెల్లించని కారణంతో బ్యాంకులు మాల్యా ఆస్తులని వేలం వేసేందుకు సిద్ధమయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ముంబైలోని అంధేరీలో ఉన్న మాల్యాకు చెందిన 2401.70 చదరపు మీటర్ల కింగ్ ఫిషర్ హౌస్‌ను గురువారం వేలం వేసింది. ఈ మేరకు స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం ఈ ప్రాపర్టీకి రిజర్వు ధరను రూ.150 కోట్లుగా నిర్ణయించింది. ఇందుకోసం ఈ-వేలం పాటలను నిర్వహించింది.
 
కాగా, ఈ వేలంలో పాల్గొనేవాళ్లు రూ.5 లక్షలు చెల్లించి, రూ.15 లక్షలు డిపాజిట్ చేయాలనే నిబంధన విధించింది. అయితే, ఈ భవనంను కొనుగోలు చేసేందుకు ఈ-వేలం పాటలు నిర్వహించగా ఒక్క బిడ్డర్లు కూడా ముందుకు రాలేదు. ఈ ముంబైతో ఆస్తులతో పాటు గోవాలో మాల్యాకు చెందిన రూ.90 కోట్ల విల్లాలను కూడా బ్యాంకులు స్వాధీనం చేసుకోనున్నారు. విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల వివరాలను సేకరించాలని సీబీఐ అధికారులు విదేశీ కోర్టులను కోరనున్నారు.