ఉచిత బస వసతితో సౌదీలో ఉద్యోగావకాశాలు

WD PhotoWD
సౌదీ అరేబియాలోని ప్రముఖ ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ సంస్థ తాము నిర్వహిస్తున్న మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్‌లలో పని చేసేందుకై ఉచిత బస, వైద్య వసతులతో పాటు ఉద్యోగావకాశాలను కల్పించేందుకు ముందుకు వచ్చింది.

ఎనిమిది గంటల పని, వారాంతం శెలవు, రెండేళ్ల తర్వాత విమానంలో రాకపోకల ఛార్జీలు, సౌదీ కార్మిక చట్టం ప్రకారం ఓవర్ టైమ్ వంటి వసతులు కలిగిన ఈ ఉద్యోగం కోసం రెండేళ్ల కాంట్రాక్టుపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.

ఎలక్ట్రోమెకానికల్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సీనియర్ ఎలక్ట్రోమెకానికల్ ఇంజనీర్, ప్లంబర్, ఎలివేటర్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, హెచ్‌వీఏసీ టెక్నీషియన్, హ్యాండీమేన్, ఏసీ టెక్నీషియన్, పెయింటర్, రైడ్ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయి.

Srinivasulu|
ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్ చివర్లో జరిగే ఇంటర్వ్యూ కోసం ముందుగా ఇంటర్నేషనల్ మేన్‌పవర్ రిసోర్సస్, ఏ-33, రాజౌరి గార్డెన్, రింగ్ రోడ్డు, న్యూఢిల్లీ -27 చిరునామాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలకు ఆ సంస్థను 011-41085108 లేక 25101111నెంబర్‌లలో సంప్రదించగలరు.


దీనిపై మరింత చదవండి :