ఒమన్ ఇంజనీరింగ్ సంస్థలో విస్తృతావకాశాలు

Srinivasulu|
ఒమన్‌కు చెందిన ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ మోట్ మాక్ డొనాల్డ్ అండ్ కంపెనీ ఎల్‌ఎల్‌సీ చేపడుతున్న ఆయిల్, గ్యాస్, ఈపీసీ ప్రాజెక్టులలో పనిచేసేందుకు పలు రకాల ఉద్యోగాలున్నాయి.

ప్రాజెక్టుల విభాగంలో ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాసెస్ విభాగంలో ప్రిన్సిపల్ డిజైన్ ఇంజనీర్లు, సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజినీర్లు, పైపింగ్ విభాగంలో డిజైన్ ఇంజనీర్లు, ప్రిన్సిపల్ డిజైనర్లు, సీనియర్ డిజైనర్లు, పీడీఎంఎస్ డిజైనర్లు కావాల్సి ఉంది.

డిజైనర్ ఉద్యోగాలకు డిప్లొమా, ఇతర ఉద్యోగాలకు ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉండాలి. చమురు, గ్యాస్, విద్యుత్, రిఫైనరీ రంగాల్లో తగినంత అనుభవం కలిగి ఉండాలి. ఆసక్తి కలిగిన వారు తమ దరఖాస్తులను ఆ సంస్థ ఈమెయిల్ ఐడీకి పంపాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు మోట్ మాక్ డోనాల్డ్, పీ.ఓ. బాక్సు నెంబర్ 587, రువి, పోస్టల్ కోడ్ 112, సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌ను లేక ఆ సంస్థ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. కుదించిన అభ్యర్థులకు జూన్ మూడో వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.


దీనిపై మరింత చదవండి :