ఓమన్‌లో పౌల్ట్రీ ఉద్యోగ అవకాశాలు

PNR| Last Modified శుక్రవారం, 16 జనవరి 2009 (14:55 IST)
ఓమన్ దేశంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమల్లో అగ్రగామిగా ఒక సంస్థ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెటర్నరీ డాక్టర్, హేచరీ టెక్నీషియన్, అకౌంటెంట్స్, వాచ్‌మెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అనుభవాన్ని బట్టి వీరికి తగిన జీత భత్యాలను అందజేస్తారు.

వెటర్నరీ వైద్యుడు పోస్టుకు దరఖాస్తు చేయదలచిన అభ్యర్థులు కనీసం ఏడు ఎనిమిది సంవత్సరాల పౌల్ట్రీ అనుభవాన్ని కలిగి వుండాలి. అలాగే హేచరీ టెక్నీషియన్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదు లేదా ఏడేళ్ళ పాటు.. డెపాకింగ్‌ అనుభవం గడించి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంపరర్ ట్రావెల్ సర్వీస్‌ లేదా భారత్‌లో ఉన్న దాని అనుబంధ సంస్థలను సంప్రదించాల్సి వుంటుంది.


దీనిపై మరింత చదవండి :