ఖతార్ ఎలక్ట్రో-మెకానికల్ సంస్ధ నుంచి ఉద్యోగావకాశాలు

Srinivasulu| Last Modified మంగళవారం, 10 జూన్ 2008 (11:01 IST)
ఖతార్‌లోని ఓ భారీ ఎలక్ట్రో-మెకానికల్ వివిధ విభాగాల్లో సాంకేతిక నిపుణులను ఆహ్వానిస్తోంది. హెచ్‌వీ ఏసీ టెక్నీషియన్ పదవులకు రెండేళ్ల ఎన్‌సీవీటీ కోర్సు చేసి, ఎనిమిది నుంచి పదేళ్ల అనుభవం కలిగిన వారిని ఆహ్వానిస్తున్నారు.

అలాగే ఎన్‌సీవీటీ లేక డిప్లొమా కోర్సు చేసి, రెండేళ్లు నుంచి ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన వారిని ఎలక్ట్రికల్ సూపర్ వైజర్ పోస్టుకు ఎంపిక చేయనున్నారు. అలాగే రిఫ్రజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, డిష్ వాషర్లు, కుక్కర్లను మరమ్మతు చేయడంలో అనుభవం కలిగిన వారిని అప్లయన్స్ టెక్నీషియన్లుగా ఎంపిక చేస్తారు.

క్లైంట్‌తో చెన్నైలో జూన్ 15న జరిగే ఫైనల్ ఇంటర్వ్యూకు హాజరు కాగోరు వారు పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తు, పాస్‌పోర్టు, రెండు కలర్ ఫోటోలతో పాటు అశుతోష్ మెరైన్స్, వేల్ అమృత టవర్స్, పాత నెం.7 (కొత్తది 15), నల్లన్న మొదలి వీధి, రాయపేట పోస్టాఫీసు ఎదురుగా, చెన్నై-14 చిరునామాలో సంప్రదించగలరు. ఇతర వివరాలకు వారిని 044-28131933/34 నెంబర్‌లో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.


దీనిపై మరింత చదవండి :