దుబాయ్ పోర్టులో భారీగా ఉద్యోగావకాశాలు

Srinivasulu|
దుబాయ్ పోర్టులో వివిధ రకాల ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి. మెరైన్ పైలట్లు, టగ్ మాస్టర్, పైలట్లు, హేవీ పోర్ట్ లిఫ్ట్ ఆపరేటర్లు, గ్యాంట్రీ క్రేన్ ఆపరేటర్లు, హెవీ క్రేన్ ఆపరేటర్లు, క్వే క్రేన్ ఆపరేటర్లు, కంటైనర్ ఆపరేటర్లు, కంటైనర్ హ్యాండ్లర్, ఇన్‌ఛార్జిలకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి.

అలాగే యార్డ్ సూపర్‌వైజర్, ఇన్‌ఛార్జి, హెవీ ఎక్విప్ మెంట్ ఆపరేటర్లు, పోర్ట్ సూపర్‌వైజర్, ఇన్‌ఛార్జి, ఆర్టీజీ, ఆర్‌ఎమ్‌జీ ఆపరేటర్లు, టాప్ లోడర్ ఆపరేటర్లు, రీచ్ స్టాకర్ ఆపరేటర్లు, సీమెన్, డైవర్లు, ట్రైలర్ డ్రైవర్లు, హెవీ డ్రైవర్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

ఆకర్షణీయమైన జీతంతో పాటు ఉచిత భోజన, బస, వైద్య, రవాణా సదుపాయాలు కూడా కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న వారు చెన్నై, చేపాక్కంలోని బెల్స్ రోడ్డు, నెంబర్ 116లో ఉన్న ట్రాన్స్ కాంటినెంటల్ ట్రేడర్స్‌లో సంప్రదించగలరు. ఇతర వివరాలకు 28547706/28547709/28589857 నెంబర్లలో ఫోన్ ద్వారా సంప్రదించగలరు.


దీనిపై మరింత చదవండి :