మలేషియాలో ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లకు ఛాన్స్

చెన్నై | Srinivasulu| Last Modified మంగళవారం, 3 జూన్ 2008 (14:13 IST)
మలేషియాలో ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లకు అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లలో డిప్లొమా లేక ఎలక్ట్రానిక్స్‌లో ఐటీఐ కోర్సు చేసి, ఏడాది అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగలరు.

ఈ అర్హతలకు సుమారు యాభై ఉద్యోగాలు ఆ బహుళ జాతి సంస్థలో ఖాళీగా ఉన్నాయి. వీరుగాక ముగ్గురు ప్లానింగ్ ఇంజనీర్లు, ముగ్గురు ప్రొక్యూర్‌మెంట్ ఇంజనీర్లు కూడా కావాల్సి ఉంది.

మెకానికల్, ఎలక్ట్రానిక్‌లలో డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు కాగలరు. ఆసక్తి ఉన్న వారు జూన్ 7,8 తేదీలలో చెన్నై, అరుంబాక్కంలో ఉన్న హోటల్ విజయ్ పార్క్‌లో జరిగే ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఇతర వివరాలకు చెన్నై, అన్నానగర్‌లోని రెండో అవిన్యూ, ఏడీ బ్లాక్‌లలో డోర్ నెంబర్ 5/1 నెంబర్‌లో టెక్‌స్కిల్స్ కెరీర్ సర్వీసెస్‌ను స్వయంగా కానీ 044-42611529 నెంబర్‌లో ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు.


దీనిపై మరింత చదవండి :