మలేషియాలో కాడ్ ఆపరేటర్లు, డిజైనర్ల ఉద్యోగాలు

FileFILE
మలేషియాలోని "పారగాన్ ఓవర్‌సీ ప్లేస్‌మెంట్ సర్వీసెస్" వారు ఇంజనీరింగ్ విభాగంలో కాడ్ ఆపరేటర్లు, డిజైనర్ల ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఇందుకుగానూ అభ్యర్థులు కాడ్ ఆపరేటర్లుగా, డిజైనర్లుగా ఇంజనీరింగ్‌లో మంచి అనుభవం కలిగి... భవిష్యత్‌లో ఆటోకాడ్ అప్‌గ్రేడ్ నాలెడ్జ్‌ను కూడా పెంచుకోగలిగినవారై ఉండాలి. అంతేగాకుండా... ప్లాన్స్, డ్రాయింగ్స్, డిజైన్ డెవలప్‌మెంట్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్ ఐ.ఇ. ప్రో-ఇ, యూనిగ్రాఫిక్స్, మాస్టర్‌కామ్ మొదలైన వాటిలో మంచి నైపుణ్యం కలిగినవారై ఉండాలి. ఇంకా, నిర్ణీత సమయంలో డెడ్‌లైన్స్‌ను రీచ్ అవుతూ, మంచి వర్క్ ఆటిట్యూడ్ కలిగినవారికి ఈ ఉద్యోగాల్లో అవకాశాలు మెండుగా ఉన్నాయి.

అభ్యర్థులు ఇంగ్లీషు భాషలో మంచి పట్టు కలిగినవారై, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. అనుభవం విషయానికొస్తే, 3 నుంచి 5 సంవత్సరాలు ఉండాలి. కాగా, ఈ ఉద్యోగాలకు గానూ సంవత్సర జీతం పన్నెండు వేల యూఎస్ డాలర్లు.

Ganesh|
మరిన్ని వివరాల కోసం... "కంపెనీ : పారగాన్ ఓవర్‌సీ ప్లేస్‌మెంట్ సర్వీసెస్, ఫోన్ నెంబర్ : +603-2260 3476"ను సంప్రదించండి. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులను పూర్తి చేసిన అభ్యర్థులు కవర్‌ లెటర్‌తో పాటుగా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను అందుకున్న వెంటనే కంపెనీకి సంబంధించిన జాబ్ సీకర్ అకౌంటెంట్ దరఖాస్తుదారుకు జవాబును పంపిస్తారు.


దీనిపై మరింత చదవండి :