మస్కట్‌లో భవన నిర్మాణ ఉపాధి అవకాశాలు

PNR|
మస్కట్‌లోని ఓమన్‌లో భవన నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు విరివిగా ఉన్నాయి. ఓమన్ షాపూర్‌జీ భవన నిర్మాణ సంస్థ వివిధ కేటగీరలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ముంబై, నారిమన్ పాయింట్‌ వద్ద గల ఆ కంపెనీ ప్రతినిధులను సంప్రదించాల్సి వుంటుంది.

సీనియర్ ఎలక్ట్రికల్ సూపర్ వైజర్, మెయింటినెన్స్, మెయింటినెన్స్ ఇన్‌చార్జ్, టెక్నీషియన్ మెకానికల్, ఆపరేటర్ సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, ఎలక్ట్రికల్ సూపర్ వైజర్స్, ఏసీ మెకానిక్, ఎయిర్ కండీషనర్ ఇంజనీర్, ఇంజనీర్ ఎలక్ట్రికల్ తదితర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు తగిన జీత భత్యాలతో పాటు, వసతి సౌకర్యాన్ని కల్పిస్తారు.


దీనిపై మరింత చదవండి :