సౌదీలో కంప్యూటర్ ట్రైనర్లకు ఉద్యోగావకాశాలు

Srinivasulu|
సౌదీలో మహిళా కంప్యూటర్ ట్రైనర్లకు ఉద్యోగావకాశాలు ఉన్నాయి. రియాద్‌లో ఉన్న సౌదీ అరేబియా విశ్వవిద్యాలయంలో ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఇంగ్లీష్‌లో ఎంఎస్- ఆఫీస్ సహా కంప్యూటర్ బేసిక్స్ నేర్పించాల్సి ఉంటుంది.

యూజీ లేక పీజీ చేసి, విండోస్, ఎంఎస్- ఆఫీస్, ఇంటర్నెట్, అవుట్ లుక్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు నేర్పించడంలో అనుభవం కలిగిన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.

పాస్ పోర్టు కలిగిన 25-50 వయసులోపు మహిళా అభ్యర్థులు కనీసం ఏడాది కాలం పాటు ఉద్యోగం చేయగలిగేందుకు సిద్ధమైతే పది రోజుల్లో దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు మహారాష్ట్ర నాలెడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఐసీసీ ట్రేడ్ టవర్, ఏ వింగ్, ఐదో అంతస్తు, సేనాపతి బాపట్ రోడ్డు, పుణే-16లో స్వయంగా కానీ 912025633724 నెంబర్‌లో ఫోన్ ద్వారా కానీ సంప్రదించవచ్చు.


దీనిపై మరింత చదవండి :