ఘనంగా చెట్టినాడ్ యూనివర్శిటీ 4వ స్నాతకోత్సవం

Venkateswara Rao. I| Last Modified బుధవారం, 4 డిశెంబరు 2013 (16:39 IST)
PR
చెట్టినాడ్ యూనివర్శిటీ 4వ స్నాతకోత్సవాలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 108 మంది విద్యార్థులకు వర్శిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎమ్ఎఎమ్ రామస్వామి చేతుల మీదుగా డిగ్రీలు, డిప్లోమాలను అందించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నై కేన్సర్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ వి.శాంత హాజరయ్యారు. ఆమె 12 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు రాజా ముత్తయ్య మరియు సిగపి ఆచ్చి అవార్డును అందజేశారు.

మరో విశిష్ట అతిథిగా హాజరయైన మాజీ ఎన్నికల అధికారి టి.ఎస్. కృష్ణమూర్తి విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మరింత ప్రతిభను కనబర్చి విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.


దీనిపై మరింత చదవండి :