ఎలాంటి జాతకస్తులు ప్రేమపై ఆసక్తి చూపుతారు?

PNR| Last Modified బుధవారం, 7 మే 2014 (16:47 IST)
File
FILE
జ్యోతిష్యం ప్రకారం ఒక్కో రాశికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనుషుల వ్యక్తిగత గుణగణాలు, అలవాట్లు కూడా జన్మరాశిని బట్టి ఉంటాయని పండితులు చెబుతున్నారు. దీనిప్రకారం ప్రేమపై ఆసక్తి చూపే జాతకులు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

వృషభం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మీన రాశుల్లో పుట్టిన జాతకులు వివాహాలపై అధిక శ్రద్ధ చూపిస్తారు. ఇందులో ముఖ్యంగా వృషభ రాశి జాతకులైతే ప్రేమించిన వారినే పెళ్లాడేందుకు తమ పెద్దలను సైతం ఎదిరించే పట్టుదల, ధైర్యం కలిగివుంటారు.

అలాగే కన్యారాశి జాతకులు కూడా ప్రేమ వివాహాలపై మక్కువ చూపుతారు. తమ భాగస్వాములను ప్రేమించే వారిగా ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ప్రేమలో గెలుస్తారా లేదా అనే విషయం వారివారి జన్మనక్షత్రం, పుట్టుకపై ఆధారపడి ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :