చంద్రుని శుభదృష్టితో మానసిక సమస్యలకు చెక్‌!

PNR| Last Modified మంగళవారం, 6 మే 2014 (16:04 IST)
File
FILE
చంద్రుని శుభదృష్టి వల్ల మానసిక సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే చంద్రుడు వక్రదృష్టితో వీక్షించడం వల్ల మనస్సు బాగుండదు. మూగతనం కూడా సంక్రమించే అవకాశం ఉంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. చివరికి మతిస్థిమితం కోల్పోవడం కూడా కద్దు. గుణాఢ్యుడి బృహత్కథ ఇందుకు ఉదాహరణ అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

అందువల్ల చంద్రుని ఆరాధనకు ఏం చేయాలంటే.. చంద్రుణ్ణి దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవం నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం అని ధ్యానించాలి. సోమవారం బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చేయాలి. ముత్యం ధరించాలి. ఇలా చేస్తే చంద్రగ్రహ దృష్టితో కలిగే అశుభఫలితాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.


దీనిపై మరింత చదవండి :