శనీశ్వరుడు మహాశివభక్తుడు. పరమేశ్వరుని వలె శనీశ్వరుడు కూడా భక్తుల కోర్కెలును తీర్చేవారేనని పండితులు అంటున్నారు. శని గ్రహం అంటే అందరికీ భయం. క్రూరుడనీ, కనికరం లేనివాడని, మనుషుల్ని ప్టుకుని పీడించే వారని అందరూ అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.