హైందవ సంస్కృతీ సంప్రదాయాలలో 108 సంఖ్యకు ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఉపయోగించే పవిత్ర మాలలో 108 పూసలు ఉంటాయి. ఒక్క హిందూ సంప్రదాయల్లోనే కాకుండా బౌద్దం, సిక్కు, జైన మతాచారాల్లో సైతం ఈ సంఖ్యకు ప్రాధాన్యం ఉంది. మంత్రోచ్ఛారణకు 108 సార్లు చేయడం ఆచారం. జపాన్‌లోని జైన దేవాలయాల్లో కొత్త సంవత్సరం ఆరంభం నాడు 108 సార్లు గంటలు కొడతారు.