Rahu Ketu Transit 2026: రాహు, కేతు గ్రహాల సంచారం.. ఈ రాశుల వారికి లాభం..
ముఖ్యంగా రాహు, కేతు వంటి చాయాగ్రహాలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యం ఉంది. ఈ రెండు గ్రహాలు మార్చి 29న మాఘ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాయని జ్యోతిష్య వర్గాలు చెబుతున్నాయి. ఈ సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక లాభాలను తీసుకురావొచ్చని భావిస్తున్నారు.
మేష రాశి
మేష రాశి వారికి ఈ సంచారం అనుకూలం. ఆకస్మిక ధనలాభాలు కలగవచ్చు. ఖర్చులు తగ్గి ఆర్థిక స్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మీ మాటతీరు ఆకర్షణీయంగా మారి, మీరు చేసే పనులకు ఇతరుల నుంచి ప్రశంసలు దక్కే అవకాశం ఉంది.
మిథున రాశి
మిథున రాశి వారికి ఊహించని ప్రగతి కనిపించవచ్చు. వ్యక్తిగత, వృత్తి సంబంధాలు మరింత బలపడవచ్చు. ఆస్తి కొనుగోలు లేదా అమ్మకాలకు ఇది అనుకూల సమయంగా మారొచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ కాలం విజయావకాశాలు వున్నాయి. శత్రువులపై ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. ఆర్థిక లాభాలతో పాటు మంచి అవకాశాలు ఎదురవుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మీన రాశి
మీనరాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. సంపాదనను సులభంగా నిల్వ చేసుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఖర్చులు తగ్గి బ్యాంకు బ్యాలెన్స్ పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాలు బలపడే అవకాశం ఉండగా, కుటుంబ సభ్యుల ఆమోదంతో వివాహ యోగం కూడా కలగవచ్చు.