బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (18:45 IST)

ఏపీలో కరోనావైరస్ కలకలం, కొత్తగా 8,096 కరోనా పాజిటివ్ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. కరోనా మహమ్మారి రోజురోజుకీ పెరిగిపోతున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8,096 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కేసులతో కలిసి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,09,558కి చేరింది. ఇందులో 84,423 యాక్టివ్ కేసులుండగా 5,19,891 మంది కరోనా నుండి కోలుకున్నారు.
 
తాజాగా మరో 67 మంది కరోనాతో పోరాడి మరణించారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 5,244కు చేరుకుంది. ఇక గడిచిన 24 గంటల్లో 74,710 టెస్టులు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 49,59,081కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
 
ఇక తాజా కేసులలో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 1405 కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 463, చిత్తూరులో 902, గుంటూరులో 513, కడపలో 419, కృష్ణా జిల్లాలో 487, కర్నూలు 337, నెల్లూరు 468, ప్రకాశంలో 713, శ్రీకాకుళం 496, విశాఖపట్నం 371, విజయనగరంలో 487, వెస్ట్ గోదావరిలో 1035 కేసులు నమోదయ్యాయి.
 
ఇక కడప జిల్లాలో 8, చిత్తూరు 7, కృష్ణా 7, తూర్పుగోదావరి 6, గుంటూరు 6, విశాఖపట్నం 6, అనంతపురం 5, నెల్లూరు 5, శ్రీకాకుళం 5, పశ్చిమగోదావరి 4, ప్రకాశం 4, విజయనగరం 3, కర్నూలులో ఇద్దరు మరణించారు.