అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ దిగ్గజాల నీడలోనే తన కెరీర్‌ను ప్రారంభించారు. సచిన్ క్రికెట్ రంగ ప్రవేశం చేసే నాటికి భారత క్రికెట్ స్వరూపం చాలా వరకూ మారింది. సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్‌ల హవా క్రికెట్‌పై ఎంతో ఉంది. సిద్దు, సంజయ్మంజ్రేకర్, అజహరుద్దీన్, రవిశాస్త్రి లాంటి కీలక ప్లేయర్లు అప్పటికే జట్టులో ఉన్నారు. వారందరి నీడలోనే ఎదుగుతూ.. టీంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని రిజర్వ్ చేసుకోగలిగాడు సచిన్ టెండూల్కర్.