అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌లో సర్ డాన్ బ్రాడ్‌మన్‌ను అధిగమించాడు. ఆస్ట్రేలియాకు చెందిన వార్తాపత్రిక ‘సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్’ నిర్వహించిన సర్వేలో సచిన్ టెండూల్కర్ 67 శాతం ఓట్లు కొట్టేశాడు. అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ బ్రాడ్మనా? టెండూల్కరా? అనే అంశంపై నిర్వహించిన సర్వేలో మొత్తం 20,768 మంది క్రికెట్ అభిమానులు పాల్గొనగా, అందులో 67 శాతం మంది తెండూల్కర్‌కు ఓటు వేశారు. 33 శాతం మంది బ్రాడ్‌మన్‌కు ఓటేశారు.