అనారోగ్యంతో సెప్టెంబర్ 22న కన్నుమూసిన 70 ఏళ్ల మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ఆకర్షణనీయమైన క్రికెటర్లలో ఒకరు. కేవలం 21 ఏళ్ల వయస్సులో భారత క్రికెట్ జట్టును నడిపించిన పటౌడీ అత్యంత పిన్నవయస్సు కెప్టెన్, భారత అత్యుత్తమ సారధుల్లో ఒకడిగా పేరొందారు. దేశం తరపున 46 టెస్ట్‌లు ఆడిన ఆయన 40 టెస్ట్‌లకు సారధ్యం వహించడం విశేషం. తన సారధ్యంలో భారత్‌కి కేవలం తొమ్మిది విజయాలను మాత్రమే అందించినప్పటికీ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపిన తొలి కెప్టెన్ 'టైగర్' పటౌడీ. 1967లో న్యూజిలాండ్‌పై విదేశాల్లో భారత్‌కి తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని అందించిన ఘనత కూడా ఆయనదే.