అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, యువ క్రికెటర్లకు మార్గదర్శకంగా నిలిచిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కెరీర్లో ఇన్నాళ్ళు కొరతగా మిగిలిన వన్డే ప్రపంచకప్ చేరాలని యావత్తు క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది. దేశంలోని 1.2 బిలియన్ ప్రజలు ఈసారి టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకుని, సచిన్ టెండూల్కర్ కెరీర్లో లేని వరల్డ్కప్ టైటిల్ను సాధించాలని ప్రజలు ఆశిస్తున్నారు.