1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
  4. Atrocious, Unacceptable : Shreyas Iyer Tears Team India Apart After Humiliating Loss vs England

అత్యంత చెత్తగా ఆడాం.. అందుకే చిత్తుగా ఓడిపోయాం : శ్రేయాస్ అయ్యర్

sreyas ayyar
ఇంగ్లండ్ గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్ 40 బంతుల్లో 70 పరుగులు చేసి, భారత బౌలర్లను చితక్కొట్టాడు. ఆ తర్వాత 202 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం 11.4 ఓవర్లలో 76 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా టీ20 చరిత్రలో అత్యంత దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. 
 
ఈ ఓటమిపై భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందిస్తూ, ఇంగ్లండ్‌తో మూడో టీ20లో తమ ప్రదర్శన అత్యంత దారుణంగా ఉందన్నాడు. 'మేం చాలా చెత్తగా ఆడాం. ఇంత భారీ తేడాతో ఓడిపోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఓటమిని అంగీకరించాల్సిందే. అదేవిధంగా ఆటతీరుపై పునరాలోచన చేయాల్సి ఉంది.
 
టెంట్‌ బ్రిడ్జ్‌ వంటి పిచ్‌పై బౌలర్లు 200 పరుగులు ఇవ్వడం సరికాదు. లక్ష్యఛేదన క్రమంలో పవర్‌ప్లేలో కీలక వికెట్లు కోల్పోయాం. అదే మమ్మల్ని దెబ్బతీసింది. టీమ్‌ మీటింగ్‌లో చాలా ప్రణాళికలు వేయొచ్చు. కానీ.. మైదానంలోకి వచ్చాక పరిస్థితులకు తగినట్లు మారాలి. ఈ పిచ్‌పై బౌలర్లకు 'హార్డ్ లెంథ్‌' బాగా కలిసివచ్చింది. కానీ, దీన్ని మేం సరిగ్గా అమలు చేయలేకపోయాం. వైఫల్యాల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఆటగాళ్లు జట్టుపై తమదైన ముద్ర వేయడం గురించి ఆలోచించడం ముఖ్యం. మేం బలంగా పుంజుకోవాలి అని శ్రేయాస్ పేర్కొన్నాడు. 
 
కాగా, శ్రేయస్‌ అయ్యర్ సారథ్యంలో భారత్ ఇప్పటివరకు ఒక్క టీ20 మ్యాచ్ కూడా గెలవలేదు. అతడి నేతృత్వంలో యూకే పర్యటనకు వెళ్లిన భారత్‌.. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌లో అనూహ్యంగా ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో తొలి టీ20 వర్షంతో రద్దు కాగా.. అనంతరం  రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. టీ20ల్లో భారత్‌ వరుసగా 5 మ్యాచ్‌ల్లో (ఒకటి రద్దు) గెలుపు రుచిచూడకపోవడం ఇదే తొలిసారి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు స్కూల్‌కు సెలవు