మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 23 మార్చి 2016 (21:25 IST)

బెంగుళూరు ట్వంటీ-20 మ్యాచ్ : బంగ్లా బౌలర్లకు తలవంచిన ధోనీ సేన... బంగ్లాదేశ్ టార్గెట్ 147 రన్స్

బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న కీలకమైన ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అత్యంత కీలకమైన మ్యాచ్‌లో కూడా కుదురుగా క్రీజ్‌లో నిలదొక్కుకుని బ్యాటింగ్ చేయలేక పోయారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
 
అంతకుముందు ప్రత్యర్థి ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లిద్దరూ మంచి శుభారంభాన్ని ఇచ్చినప్పటికీ.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేక పోయారు. ఫలితంగా వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. ఫలితంగా భారత్ 7 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 42 పరుగులు చేసింది. కాగా, భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ 16 బంతుల్లో 18 పరుగులు (ఓ సిక్సర్, ఓ ఫోర్) చేయగా, ధవాన్ 22 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు.  
 
ఆ తర్వాత క్రీజ్‌లో కుదురుకునేందుకు సింగిల్స్‌కే పరిమితమైన విరాట్ కోహ్లీ... చివరకు 24 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్ సాయంతో 24 పరుగులు చేసి స్పిన్నర్ హోం బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటికి భారత్ స్కోరు 13.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. 
 
ఆ తర్వాత సురేష్ రైనాతో జతకలిసిన యువ క్రీడాకారుడు పాండ్యా క్రీజ్‌లోకి వచ్చీరాగానే ఓ సిక్సర్ కొట్టాడు. అయితే, జట్టు స్కోరు 112 పరుగుల మీద ఉండగా, భారత్ వరుసగా (112/5) రెండు వికెట్లను కోల్పోయింది. సురేష్ రైనా 23 బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేయగా, పాండ్యా 7 బంతుల్లో ఒక సిక్సర్, రెండు ఫోర్లు కొట్టి 15 పరుగులు చేశాడు. 
 
క్రీజ్‌లో ధోనీ, యువరాజ్ ఉన్నప్పటికీ వారు కూడా రాణించలేక పోయారు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు.. అద్భుతమైన క్యాచ్‌లు, ఫీల్డింగ్‌లతో ఆకట్టుకున్నారు. ఫలితంగా భారత్ ఆటగాళ్లు పరుగులు రాబట్టుకునేందుకు శ్రమించాల్సి వచ్చింది. యువరాజ్ సింగ్ 3, జడేజా 12, ధోనీ 11 (నాటౌట్), అశ్విన్ 5 పరుగులు చొప్పున చేసి ఔట్ అయ్యారు. 
 
అయితే, 112 పరుగుల వద్దే రెండు వికెట్లు (రైనా, పాండ్యా) కోల్పోగా, ఆరో వికెట్‌ను 117 పరుగుల వద్ద, 7వ వికెట్‌నవు 137 పరుగుల వద్ద భారత్ కోల్పోయింది. బంగ్లా బౌలర్లలో రెహ్మాన్, హోస్సేన్ నాలుగు చొప్పున పరుగులు చేయగా, హోం, మహ్మదుల్లా, అల్ హాసన్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.